పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సెన్సార్ ఎప్పుడు? ముందు అనుకొన్నట్టు ఈరోజే (మార్చి 31)న జరుగుతుందా? లేదంటే ఏప్రిల్ 2కి వాయిదా పడుతుందా? పాటలు లేకుండానే సర్దార్ సినిమాని సెన్సార్ చేస్తారా? లేదంటే సినిమా మొత్తం ఒకేసారి సెన్సార్ చేయిస్తారా? ఇలాంటి అనుమానాలకు పుల్‌స్టాప్ పడిపోయింది. సర్దార్ సినిమా సెన్సార్ ముందుకు వెళ్లిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సర్దార్ సినిమాని సెన్సార్ సభ్యులు వీక్షిస్తున్నారు. సాయింత్రానికల్లా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసే అవకాశాలున్నాయి.
ఈ సినిమాని మార్చి 31న సెన్సార్ చేయించాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. అయితే.. ఇంకా రెండు పాటలు స్విర్జర్లాంగ్ నుంచి రావాల్సివుంది. ఆ పాటలు వస్తే గానీ.. సెన్సార్ ముందుకు సర్దార్ సినిమా వెళ్లదు అనుకొన్నారంతా. అయితే.. ఏప్రిల్ 8న ఎట్టిపరిస్థితుల్లోనూ సర్దార్ని విడుదల చేయాల్సిందే అన్న ధృడ సంకల్పంతో ఉన్న పవన్ టీమ్ మాత్రం.. తన చేతిలో ఉన్న ఏ అవకాశాన్నీ మిస్ చేసుకోవడం లేదు. రెండు పాటలు లేకుండానే సర్దార్ సినిమాని సెన్సార్‌కి పంపింది. మిగిలిన రెండు పాటల్నీ ఏప్రిల్ 2న సెన్సార్‌కి చూపిస్తారు. అప్పుడు.. సినిమా మొత్తానికి ఒకేసారి సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. రేపు (శుక్రవారం) సర్దార్ టీమ్ ఫారెన్ ట్రిప్ ముగించుకొని తిరుగొస్తుంది. రెండు పాటల్ని చకచక ఎడిట్ చేసి శనివారం సర్దార్ని రెండోసారి సెన్సార్ చేస్తారు.