సర్దార్ – గబ్బర్‌సింగ్ రిజల్ట్ పక్కన పెడితే.. తొలిరోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి అన్నది కాదనలేని సత్యం. ఫస్ట్ డే ఇండ్రస్ట్రీ రికార్డుకు ఎంత దగ్గరగా ఉందో ఇప్పుడే చెప్పలేం గానీ.. ఓవర్సీస్లో మాత్రం గబ్బర్‌సింగ్ రికార్డు సృష్టించిందనే చెప్పాలి. అమెరికాలో ఈ సినిమా తొలి రోజు రూ.4.3 కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు లెక్క గట్టాయి. బాహుబలి తరవాత తొలి రోజు అమెరికాలో ఇన్ని వసూళ్లు సాధించిన చిత్రం సర్దారే. శ్రీమంతుడు (3.7) కోట్లు కూడా తరువాతి స్థానంలో ఉన్నాడు. ప్రీమియర్ షోలు ఎక్కువగా పడడం, వాటి రేట్లు అధికంగా ఉండడంతోనే సర్దార్ ఈ మ్యాజిక్ చేయగలిగిందేమో. శని, ఆదివారాలు కూడా సర్దార్ ఇదే దూకుడు చూపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర్రాలలో తొలిరోజు రికార్డులు పరిశీలిస్తే… సర్దార్ రెండో స్థానంలో ఉండొచ్చని, బాహుబలి వసూళ్లకు అతి దగ్గరలో వచ్చి ఆగిపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రీమియర్ షో టికెట్లు ఎక్కువ రేట్లు పోసి అమ్మేయడం వల్ల.. ఆ లెక్కలు స్పష్టంగా తెలుస్తాయా, లేదా అన్న అనుమానాలూ ఉన్నాయి. మొత్తాని సర్దార్ తొలిరోజే శ్రీమంతుడ్ని దాటేసింది. ఓవరాల్ పరిస్థితి మాత్రం ఇప్పుడే చెప్పలేం. శ్రీమంతుడు టోటల్‌గా రూ.150 కోట్ల గ్రాస్ సాధించాడు. రిజల్ట్‌ని బట్టి చూస్తే సర్దార్కి అంత సీన్ లేదు మరి.