ఇండ్రస్ట్రీకొచ్చి పదేళ్లయినా, దాదాపుగా టాప్ స్టార్లందరితోనూ నటించినా… పవన్ కల్యాణ్‌తో జోడీ కట్టడానికి సర్దార్ గబ్బర్ సింగ్ వరకూ ఆగాల్సివచ్చింది కాజల్‌కు. ఆలస్యమైనా క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కిందని మురిసిపోయింది కాజల్. తన కెరీర్‌కి మంచి బూస్టప్ కావల్సిన పరిస్థితుల్లో వచ్చిన ఛాన్స్ ఇది. దాంతో.. కాజల్ కూడా సంబరపడిపోయింది. గబ్బర్‌సింగ్ తరవాత శ్రుతిహాసన్ లక్కీ గాళ్ అయిపోయినట్టు అలాంటి అదృష్టం తనకీ వరిస్తుందేమో అని ఆశ పడింది. తీరా చూస్తే.. సర్దార్ కాజల్కీ మైనస్ అయిపోయింది.
ఈ సినిమాలో ఎప్పుడూ లేనంత డల్‌గా కనిపించింది కాజల్. మేకప్ అయితే మరీ ఘోరంగా ఉంది. తన కాస్ట్యూమ్స్ కూడా నప్పలేదు. ఇవన్నీ.. దర్శకుడు, కథ, ఆ పాత్రలో ఉన్న లోపాలు అనుకోవొచ్చు. కాజల్ వయసు పెరుగుతోందన్న విషయం.. ప్రతీసారీ అర్థమవుతూనే ఉంది. ఆమెను క్లోజప్‌లో చూపించినప్పుడల్లా కాజల్ ముదిరిపోయిందన్న ఫీలింగ్ కలుగుతోంది. యువరాణి పాత్రంటే కాజల్ పేరే పలవరిస్తారు. మగధీరతో తాను చూపించిన మార్క్ అది. ఈసారీ యువరాణి పాత్రలోనే కనిపించింది. కానీ ఏమాత్రం సెట్ కాలేదు. గబ్బర్‌సింగ్‌కి డివైడ్ టాక్ వస్తున్నందుకు ఆ చిత్రబృందంలో ఎవరు బాధపడినా పడకపోయినా.. కాజల్ మాత్రం వర్రీ అవుతుంటుంది. ఎందుకంటే.. ఈ సినిమా ప్రభావం ఆమె కెరీర్‌పైనే పడే అవకాశాలున్నాయి.