పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పటికే ప్రి రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ ఏప్రిల్ 8న డిసైడ్ చేసిన చిత్ర యూనిట్ ఆడియోను మార్చ్ రెండు లేదా మూడో వారంలో రిలీజ్ చేయనున్నారట. సర్దార్ ఆడియోని కూడా భారీ రేంజ్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.
పవర్ స్టార్ స్టామినా ఏంటో ఈ ఆడియో రిలీజ్ లో కూడా తెలిసేలా లక్ష మంది అభిమానులు పట్టేలా గచ్చిబౌలి స్టేడియం లో సర్దార్ ఆడియోను విడుదల చేస్తారట. అంతేకాదు ఈ ఆడియోకి మెగా హీరోలంతా అతిథులుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ ఆడియోకి దాదాపు కోటి 80 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. అయితే సర్దార్ ఆడియో ఇంత గ్రాండ్ గా ఎందుకు చేయాలి అనే సందేహాలు వస్తున్నా ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్న ఎవరికి వారు తమ స్టామినా ఇది అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆ క్రమంలోనే పవన్ కళ్యాన్ తన ఆడియోకి లక్షమంది అభిమానులతో కొత్త అభివాదం చేయనున్నాడు.
ఇటు సినిమాలు చేస్తూనే జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాన్ అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్న సర్దార్ ఆడియో అంతే గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుందాం.