అభిమానులు పండుగ చేసుకునే రోజు రానే వచ్చింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరిసారి గబ్బర్ సింగ్ గా తన పంజా విసిరేందుకు ఈ అర్ధరాత్రి నుండే థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక విడుదలకు ఇంకొన్ని గంటలే ఉన్న ఈ సినిమా ముందు నిలబడి ఉన్న సవాళ్ళను మనం ఓసారి గుర్తుచేసుకోవాలి..
ఓవర్సీస్ లో ముఖ్యంగా యుఎస్ లో ప్రిమియర్ షోల ద్వారా హయ్యెస్ట్ ఎమోంట్ కలెక్ట్ చేసిన రికార్డు ఇప్పటిదాకా బాహుబలిదే. సినిమా రిలీజ్ అయిన నాటి నుండి డాలర్ల వర్షం కురిపించింది. టోటల్ గా 10.1 లక్షల డాలర్లు వసూలు చేసింది బాహుబలి. ఆ సినిమాకు 118 స్క్రీన్లలో ప్రీమియర్ షోస్ వేయగా.. సర్దార్ గబ్బర్ సింగ్ కు 300 దాకా ప్రిమియర్లు ప్లాన్ చేశారు. కాబట్టి ఈ రికార్డు సునాయాసంగా పవర్ స్టార్ బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు సినిమా చరిత్రలో నా భూతో న భవిష్యత్ అన్న విధంగా బాహుబలి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.28.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ రికార్డును క్రాస్ చేయడం సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల అవుతుందో లేదో మరి. అయితే నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని దాటేసినా శ్రీమంతుడు పేరిట ఉన్న రికార్డును మాత్రం సర్దార్ సునాయాసంగా బద్దలు కొట్టే అవకాశముంది. శ్రీమంతుడు తొలి రోజు రూ.19 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
బాహుబలి అన్ని భాషల్లో కలుపుకుని కేవలం రెండు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. శ్రీమంతుడు సినిమా 10 రోజుల్లో వంద కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసింది. మరి పవర్ స్టార్ ఎన్ని రోజుల్లో వందకోట్లు టచ్ చేస్తాడో చూడాలి.
ఇక తొలి వారంతరం బాహుబలి మొత్తం 197 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూలు చేసింది. తొలి వీకెండ్లో శ్రీమంతుడు రూ.60 కోట్ల గ్రాస్.. రూ.42.8 కోట్ల షేర్ వసూలు చేసింది. మరి సర్దార్ తొలి వీకెండ్ లో ఎంతటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి. మొత్తానికి భారీ అంచనాలతో భారీ బిజినెస్ తో వస్తున్నా సర్దార్ ముందు అంతే భారీ టార్గెట్లు కూడా ఉన్నాయి. మరి ఈ సవాళ్ళను సర్దార్ అధిగామిస్తాడా లేదా అన్నది కొద్ది గంటల్లో తెలుస్తుంది.