సర్దార్ పటేల్ అంటే బీజేపీ పెద్దలకు ఎంత గౌరవమో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రూ. మూడు వేల కోట్లు పెట్టి.. అహ్మదాబాద్‌లో ఆయనకు అత్యంత భారీ ఎత్తున విగ్రహం కూడా పెట్టించారు. ఎక్కడికి వెళ్లినా పటేల్ నామస్మరణ చేస్తూంటారు. ఇంత ాచేసిన ఆయన కాంగ్రెస్ నేత. బీజేపీ నేత కూడా కాదు. అయినప్పటికీ.. గుజరాత్ ప్రైడ్ గా… ఆయనను ఓన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన పేరును తొలగించి మోడీ పేరు పెట్టుకునే కార్యక్రమాలను ప్రారంభించడమే చర్చనీయాంశం అవుతోంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.
మోతెరాగా ప్రసిద్ధి పొందిన ఆ స్టేడియాన్ని ఇప్పుడు విస్తరించారు. లక్షా పదివేల సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద స్డేడియంగా తీర్చిదిద్దారు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్ ఆ స్టేడియంలోనే ప్రారంభమయింది. కానీ.. సర్దార్ పటేల్ స్టేడియంలో కాదు. నరేంద్రమోడీ స్టేడియంలో. అంటే సర్దార్ పటేల్ పేరు తీసేసి.. నరేంద్రమోడీ పేరు పెట్టారన్నమాట. ఇలా పేరు మారుస్తున్న విషయం చాలా గోప్యంగా ఉంచారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్టేడియాన్ని ప్రారంభించే సమయంలో మాత్రం… అహ్మదాబాద్‌లోని మెతెరాలో ఉన్న సర్దార్ పటేల్ స్టేడియం.. ఇక లేదని.. అక్కడ ఉన్నది నరేంద్రమోడీ స్టేడియం అని తేలిపోపోయింది.
1982లో 49 వేల సీటింగ్ సామర్థ్యంతో పటేల్ స్టేడియాన్ని నిర్మించారు. 2015లో లక్షా 10 వేల సీటింగ్ కెపాసిటీతో భారీ నిర్మాణాన్ని చేపట్టారు. ఇది గతేడాది ఫిబ్రవరిలోనే పూర్తయ్యింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు వచ్చిన వేళ ఈ స్టేడియాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇప్పుడు మోడీ పేరు పెట్టి కొత్తగా ఓపెనింగ్ చేశారు. మొత్తానికి పటేల్‌ను రీప్లేస్ చేసేందుకు మోడీ, షాలు ఉత్సుకతతో ఉన్నారనన్న సైటైర్లు ప్రారంభమయ్యాయి.