ఈ గురువారం నుంచే పంద్రాగస్ట్ సినిమాల పండగ మొదలైపోతుంది. ఈ వారం మొత్తం నాలుగు సినిమాలు. ఇక నెలాఖరున ‘సరిపోదా శనివారం’ తో వస్తున్నాడు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అంటే సుందరానికీ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు జతకట్టారు. ఆర్ఆర్ఆర్ తర్వాత డివివి నిర్మించిన సినిమా. ఎస్జే సూర్య పవర్ ఫుల్ రోల్. ఇలా చాలా ప్రత్యేకతలు వున్నా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.
ట్రైలర్ లో కథని ఆసక్తికరంగా రివిల్ చేసిన విధానం బావుంది. నాని, ఎస్జే సూర్య.. ఈ రెండు పాత్రల మధ్య కోపమే ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్. ఎస్జే సూర్య క్యారెక్టర్ కి కోపం ఎక్కువ. అన్యాయంగా విరుచుకుపడుతుంటాడు. సూర్య క్యారెక్టర్ కి అంతకుమించిన కోపం. కానీ ఆ కోపాన్ని కేవలం శనివారం రోజే చూపిస్తాడు. ఇలాంటి రెండు పాత్రల మధ్య జరిగినగొడవ ఏమిటి ? ఆ ఈగో వార్ ఏ స్థాయికి వెళ్ళిందనేది పాయింట్. అయితే పాయింట్ లోనే మూడో కన్ను తెరిచే శివుడు అనే డైలాగ్ కూడా వుంది. అంటే నాని క్యారెక్టర్ లో ఎదో ఫ్లాష్ బ్యాక్ వుందనే హింట్ ఇచ్చినట్లు అనిపించింది.
నాని ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు. చివర్లో తన క్యారెక్టర్ చాలా మ్యాడ్ నెస్ కనిపించింది. ఎస్జే సూర్య క్యారెక్టర్ కి కూడా అంతే చాలా ప్రధాన్యత వుంది. ట్రైలర్ ఫస్ట్ హాఫ్ లో ఆయనే డామినేట్ చేశారు. ఈ ఇద్దరు కాకుండా ఇంకా అజయ్ ఘోస్, సాయి కుమార్ తో పాటు చాలా మంది ప్రముఖ నటులు కీలక పాత్రల్లో వున్నారు. కెమరాపనితనం, నేపధ్య సంగీతం..రిచ్ గా వుంది. యాక్షన్ కి పెద్దపీట వేశారు. వివేక్ అత్రేయ స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్. ఈ ట్రైలర్ కట్స్ చూస్తుంటే కాస్త వైవిధ్యంగానే కథ తెరపై కదులుతుందని అనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచగలిగింది.