https://www.youtube.com/watch?v=2cVu7KZxW3c
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు పరశురామ్. `సర్కారు వారి పాట` టీజర్ ని విడుదల చేశాడు. ఇందులోని మహేష్ లుక్.. బాడీ లాంగ్వేజ్, తన స్క్రీన్ ప్రెజెన్స్.. అభిమానుల్ని మంత్ర ముగ్థుల్ని చేస్తోంది. `ఇఫ్ యు మిస్ ది ఇంట్రస్ట్.. యు విల్ గెట్ ది డేట్` అంటూ టైగర్ – రాబిట్ కథొకటి చెప్పాడు… టీజర్లో. ఇప్పుడు ఈ డైలాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.
ఇంట్రస్ట్ అంటే. వడ్డీ అని అర్థం. పులి – కుందేల్ని డేట్ కి తీసుకెళ్లి చంపుకుతింటుంది. నువ్వు వడ్డీ ఎగ్గొట్టినా, అదే జరుగుతుంది.. అని రౌడీ మూకకు మహేష్ ఇచ్చే వార్నింగ్ ఇది. ఈ సినిమాలో మహేష్ వడ్డీ వ్యాపారిగా కనిపించబోతున్నాడు. తన పాత్ర చాలా పెక్యులర్ గా ఉండబోతోంది. వడ్డీ వసూలు చేసే విషయంలో చాలా మొండిగా ఉండే మహేష్ బాబుని తెరపై చూడబోతున్నాం. మహేష్ మెడపై రూపాయి నాణెం టాటూగా కనిపిస్తోంది. దానికీ ఈ సినిమాలో ఓ కథ ఉంది. రూపాయి కూడా చేజారనివ్వకుండా.. కాపాడుకొనే క్యారెక్టర్ అది. దానికి సింబాలిక్ గా ఆ రూపాయి క్వాయిన్ని చూపిస్తున్నారు. చివర్లో `ఏవయ్యా కిషోర్.. ఓ ఐదారు మూరలుండవా అవి..` అంటూ కీర్తి సురేష్‌ని చూస్తూ చెప్పే డైలాగ్ వుంది. అయితే అది కీర్తి మెడలో మల్లె పూల గురించైనా… కీర్తి ఎత్తు ఐదారు మూరలకంటే ఎక్కువ ఉండదని చెప్పడానికి సింబాలిక్ గా మహేష్ చెప్పే డైలాగ్ ఇది. ఈసీన్ లో.. మల్లెపూల పై మహేష్ హిలేరియస్ కామెడీ చేయబోతున్నాడని, ఈ సీన్.. సినిమాలోనే హైలెట్ గా నిలుస్తుందని ఇన్ సైడ్ వర్గాల టాక్.