మహేష్ బాబు బేసిగ్గా సిగ్గరి. ఆయన స్టేజ్ పై మాట్లాడటమే ఎక్కువ. అలాంటింది ఏకంగా డ్యాన్స్ చేశారు. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’. సక్సెస్ సెలబ్రేషన్స్ ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సహా చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఒక మాస్ మూమెంట్ చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది.
ఇలా డ్యాన్స్ చేయడానికి కారణం కూడా చెప్పారు మహేష్ ”ఒక్కడు సినిమా షూటింగ్ జరిగినప్పుడు కర్నూల్ వచ్చాను. రెండు రోజుల వ్యవధిలో సర్కారు వారి పాట వేడుక ఇక్కడ పెట్టుకున్నాం. ఐతే ఇంత మంది వస్తారని అనుకోలేదు. మీ అందరినీ చూసిన ఉత్సాహంలో స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేశాను. ఇది మీ కోసమే. మీ అభిమానం ఎప్పుడు ఇలానే వుండాలి. ఇది సక్సెస్ మీట్లా లేదు. వంద రోజులు వేడుక చేసుకున్నట్లు వుంది”అని తన ఆనందం వ్యక్తం చేశారు మహేష్.