సరైనోడు సినిమా రెండోసారి సెన్సార్ జరుపుకొంది. మొదటిసారి.. A సర్టిఫికెట్ వస్తే…. ఈసారి U/A తెచ్చుకోగలిగింది. A సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరమైపోతారు. దానికి తోడు మల్టీప్లెక్స్‌లలో 18 ఏళ్లలోపువాళ్లకు అనుమతులు ఉండవు. ఆ భయంతోనే.. సరైనోడు సినిమాని రీసెన్సార్ చేయించింది చిత్రబృంం. ఈసారి అనుకొన్న రిజల్టే వచ్చింది. ఈసినిమా చూసి… చిరంజీవి కొన్ని మార్పులు చెప్పడం, ఆఖరి క్షణాల్లో రీషూట్ జరుపుకోవడం తెలిసిన విషయమే. రీషూట్ చేసినప్పుడు మళ్లీ సెన్సార్ అనుమతులు తీసుకోవడం తప్పని సరి. దాంతో.. సినిమా మొత్తం సెన్సార్ బోర్డు రెండోసారి చూడాల్సివచ్చింది.
సెకండాఫ్‌లో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండడం, అవి మరీ బీభత్సంగా తెరకెక్కించడంతో సెన్సార్ తొలిసారి ఏ ఇచ్చింది. రెండో దఫా వాటిని ట్రిమ్ చేసి కొత్త సన్నివేశాలు జోడించారు. డోసు తగ్గడంతో సెన్సార్ U/A ఇచ్చింది. దాంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకొంది. ఈనెల 22న సరైనోడు థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచేశారు. టాక్ కొంచెం పాజిటీవ్ గా వచ్చినా ఈ సమ్మర్లో సరైనోడు దుమ్ము రేపడం ఖాయం.