సరైనోడు విడుదలై మూడు వారాలు గడిచింది. డివైడ్ టాక్ వచ్చినా.. అల్లు అర్జున్ స్టామినాతో, ప్రచార వ్యూహంతో ఈసినిమా నిలబడింది. పోటీ పెద్దగా లేకపోవడంతో లాభాల బాట పట్టింది. ఇప్పటి వరకూ ఈ చిత్రానికి రూ. 66 కోట్ల షేర్ దక్కినట్టు టాక్. గ్రాస్ లెక్కేస్తే వంద కోట్లు దాటేసింది. నైజాంలో అత్యధికంగా 17 కోట్లు దక్కించుకొంది. సీడెడ్లో రూ.10 కోట్లు దాటేసింది. ఓవర్సీస్లో మాత్రం ఆశించిన వసూళ్లు రాలేదు. అక్కడ.. రూ.4 కోట్లు కూడా దక్కించుకోలేదు. గత వారం 24 సినిమా విడుదల కావడం, ఆ చిత్రానికి పాజిటీవ్ టాక్ దక్కడంతో… సరైనోడు వసూళ్లు తగ్గాయి. ముఖ్యంగా ఏ సెంటర్లలో 24 హవా చూపిస్తోంది.
అయితే సరైనోడు రిజల్ట్ పట్ల బన్నీ ఖుషీగానే ఉన్నాడు. ”ఏ సెంటర్లలో వసూళ్లు తగ్గాయి. కాదనను. కానీ… ఈ సినిమా వరకూ నా టార్గెట్ బీ, సీ ఆడియన్సే. వాళ్లకు ఈ సినిమా క్యాటర్ చేయగలిగాం” అంటున్నాడు బన్నీ. అల్లు అరవింద్దీ అదే మాట. 24 సినిమా గనుక రాకపోయి ఉంటే మరిన్ని వసూళ్లు వచ్చేవని చిత్రబృందం చెబుతోంది.