సినిమా సెన్సార్ అయితే చాలు.. ‘టాక్’ బయటకు వచ్చేస్తోంది. సినిమా అలాఉందట.. ఇలా ఉందట.. అంటూ మోసేస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో అది కూడా ఓ భాగమైపోతోంది. బాగుందన్న టాక్ వస్తే.. చిత్రబృందం కూడా హ్యాపీ! నెగిటీవ్ టాక్ వస్తే మాత్రం బెంబేలెత్తిపోతోంది. ఇప్పుడు సరైనోడుకి సంబంధించి ఓ ప్రీ టాక్.. బయట షికారు చేస్తోంది. అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. ఈనెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈలోగా.. ల్యాబ్ రిపోర్ట్ బయటకు వచ్చింది.
సరైనోడు ఫస్ట్ ఆఫ్ అదిరిపోయిందన్నది లాబ్ రిపోర్ట్. బోయపాటి శ్రీనుకి యాక్షన్ అంటే మక్కువ. తనకు అచ్చొచ్చిన దారిలోనే యాక్షన్ సీన్స్‌ని ఓ రేంజులో తీశాడట. ఎమోషన్ ఎక్కడకక్కడ కనెక్ట్ అవ్వడంతో… ఫస్టాఫ్ కేక పుట్టిందట. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా అదిరిపోవడంతో సినిమా ఓ లెవిల్‌కి వెళ్లిపోయిందని టాక్. అయితే.. సెకండాఫ్ మాత్రం ఎక్కడ లేని నీరసం ఆవహించిదట. కామెడీ సీన్లు.. పండక పోవడంతో లాగ్ అయిన ఫీలింగ్ వచ్చిందట. అయితే క్లైమాక్స్‌లో.. యధావిధిగా బోయపాటి రెచ్చిపోయాడట. యాక్షన్, ఎమోషన్స్, బన్నీ డాన్సులూ ఈ సినిమాకి ప్రధాన బలాలుగా నిలిచాయి. సెకండాఫ్ బాగుంటే.. ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది అంటున్నారు సినీ జనాలు. అందుకోసమే చివర్లో హడావుడిగా రీషూట్లు కూడా జరిపారట. అయితే. అవి ఏమంత వర్కవుట్ అయ్యాయో తెలియాలంటే సరైనోడు బయటకు రావాల్సిందే.