భారీ అంచనాల మధ్య సరైనోడు చిత్రం బాక్సాఫీసుముందుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1600 థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా.. సరైనోడు సినిమాకున్న క్రేజ్, బన్నీ స్టామినా, బోయపాటి ట్రాక్ రికార్డుల్ని చూసి.. థియేటర్ ముందు జనం హోరెత్తారు. టోటల్‌గా తొలిరోజు అన్ని షోలూ ఫౌస్ఫులే. ఫలితంగా బన్నీ కెరీర్లో హయ్యస్ట్ ఫస్ట్ డే వసూళ్లు రాబట్టింది సరైనోడు. తొలి రోజు 10.97 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజంలో రూ.3.18 కోట్లు, సీడెడ్‌లో 2.13 కోట్లు సాధించింది. ఈస్ట్‌లో రూ.1 కోటి దాటింది. అమెరికాలో రూ.1.13 కోట్లు సాధించింది.
తొలి రోజు వసూళ్ల పట్ల చిత్రబృందం సంతోషంగానే ఉన్నా.. డివైడ్ టాక్ వల్ల రెండో రోజు డ్రాప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెనిఫిట్ షోలు లేకపోవడం సరైనోడుకి పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఆరూపేణా కనీసం రూ.50 లక్షల్ని సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఓవర్సీస్లో సరైనోడుకి గడ్డుకాలం ఎదురయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇది ఊరమాస్ చిత్రం. ఓవర్సీస్లో ఇలాంటి సినిమాలు అంతగా ఎక్కవు. సో… ఓవర్సీస్లో సరైనోడు నష్ట భారం మోయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.