అల్లు అర్జున్ ‘సరైనోడు’గా… సిద్ధమవుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే.. సరైనోడుకి సంబంధించి ఓ హాటెస్ట్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. నిజానికి ఇది అల్లు అర్జున్ కోసం రాసుకొన్న కథ కాదట. గోపీచంద్ కోసం సిద్ధమైందట. ఆ తరవాత.. ఎన్టీఆర్‌కీ వినిపించారట. వాళ్లిద్దరూ నో చెప్పడంతో బన్నీ దగ్గరకు వచ్చి ఆగినట్టు తెలుస్తోంది.
బోయపాటి – ఎన్టీఆర్ కాంబినేషన్లో దమ్ము అనే సినిమా వచ్చింది. ఆ సమయంలో ఎన్టీఆర్‌కి బోయపాటి వినిపించిన కథ.. ఇదే. కథలో కొన్ని లోటు పాట్లు ఉండడంతో ఎన్టీఆర్ ‘నో’ చెప్పాడట. ఆ తరవాత దమ్ము స్ర్కిప్ట్ పట్టాలెక్కింది. తులసి తరవాత గోపీచంద్‌తో ఓ సినిమా చేద్దామని ప్లాన్ చేశాడు బోయపాటి. ఈ కాంబినేషన్ దాదాపుగా ఓకే అయిపోయింది కూడా. కానీ… కథ నచ్చక గోపీచంద్ డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ కథని బన్నీ స్టైల్‌కి తగినట్టుగా బోయపాటి మార్చాడట. ఇద్దరు హీరోలు నో అన్న కథని బన్నీ ఎలా ఒప్పుకొన్నాడో..?? అని మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఫీలవుతున్నారు. సినిమా హిట్టయితే ఇవన్నీ మర్చిపోతారు లెండి.