1971లో సంచలనం సృష్టించిన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కామ్’ సినిమాగా రానుంది. ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ హిస్టరీలో చాలా సంచలనం రేపిన కుంభకోణం ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కామ్ అనడం కంటే ఇందిరాగాంధీ వాయిస్ స్కామ్ అంటే చాలా మందికి గుర్తొస్తుంది.
చాలా నాటకీయత వున్న స్కామ్ ఇది. 1971లో ఢిల్లీలోని స్టేటు బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంటు స్ట్రీటు బ్రాంచ్లో చీఫ్ కాషియర్గా పనిచేస్తిన్న వేద్ ప్రకాశ్ మల్హోత్రకు ప్రధాని ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. ఆయన స్వయంగా ఇందిరా వాయిస్ ని ఫోన్ లో విన్నాడు. బంగ్లాదేశ్లో నిర్వహిస్తున్న ఒక సీక్రెట్ మిషన్ కి రూ.60 లక్షలు అవసరం పడ్డాయని, డబ్బు రెడీ చేసి, ఫలానా వారికి ఇచ్చి, పార్లమెంటు హౌస్కు వచ్చి ఆ డబ్బుకు రసీదు తీసుకోండనేది ఆ ఫోన్ లోని సందేశం. ఫోన్ లో విన్నట్లే వేద్ ప్రకాశ్ మల్హోత్ర డబ్బుని అందించాడు. రసీదు తీసుకోవడానికి పార్లమెంటు హౌస్కు వెళ్లిన మల్హోత్రాకు షాక్ తగిలింది. అసలు ఇందిరా ఎవరికీ ఫోన్ చేయులేదు. ఆ డబ్బు సంగతి ఆమెకు తెలీదు.
దీంతో పోలీస్ కేసు పెట్టాడు మల్హోత్ర. ఈ కేసుని తుఫాను వేగంతో విచారణ జరిపి ముగించారు. దీనికి ఆపరేషన్ తుఫాను అనే పేరుంది. ఈ కేసులో చాలా మలుపులు వున్నాయి. భారత సైనిక గూఢచార వ్యవస్థకు సంబధించిన కొన్ని అంశాలు వున్నాయి. ఇలాంటి సంచలనమైన స్కామ్ వెండితెరపైకి రావడం ఆసక్తికరమే.