దేవర ముందర బావ బావమరిది

96 సినిమాతో డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ పేరు బయటికి వచ్చింది. ఆ సినిమా మ్యాజికల్ హిట్. తెలుగులో రిమేక్ మాత్రం సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు ప్రేమ్ కుమార్ నుంచి మరో సినిమా వస్తోంది. అదే ‘సత్యం సుందరం’. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సూర్య, జ్యోతిక నిర్మాతలు.

తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు. కార్తీ, అరవింద్ స్వామిబావ బావమరిది గా కనిపించారు. వారి కెమిస్ట్రీ బావుంది. కార్తి పల్లెటూరి గెటప్ లో కనిపిస్తే అరవింద్ మాత్రం అర్బన్ లుక్ లో కనిపించారు. బావ బావ .. అని కార్తి పిలవడం, అరవింద్ పెద్ద ఆసక్తి చూపించకపోవడం టీజర్ లో ఆసక్తిని పెంచింది.

టీజర్ లో 96 టచ్ కనిపించింది. ఆ సినిమా కథ దాదాపు నైట్ లోనే జరుగుతుంది. సత్యం సుందరం టీజర్ లో కూడా అదే నైట్ వైబ్ కనిపించింది. ఈ రెండు పాత్రల మధ్య ఎదో బలమైన ఎమోషనే ప్లాన్ చేశాడు దర్శకుడు.

సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. అదే రోజు దేవర సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే. కార్తి సినిమాకి తెలుగులో కూడా మంచి ఆదరణ వుంటుంది. అయితే దేవర ముందుర సత్యం సుందరం లాంటి లైట్ హార్ట్ డ్రామా కనీసం ప్రభావం చూపించగలదా అనేది ప్రశ్న.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

Comments are closed.