కమల్ హాసన్ , రజనీకాంత్ లు రాజకీయాల్లో తమ మార్కు చూపడానికి ప్రయత్నిస్తున్న విషయం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి త్వరలోనే పార్టీలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే .అయితే వీరిద్దరిపై విరుచుకుపడ్డాడు నటుడు సత్యరాజ్.
30 సంవత్సరాలపాటు సినిమాల్లో ఉన్నంత మాత్రాన సమాజం గురించి అవగాహన వస్తుందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అని రజనీకాంత్ , కమల్ హాసన్ ల కి చురకలంటించారు సత్యరాజ్. అలాగే మూడు తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాక అక్కడ ఫెయిలైనా తమకు కలిగే నష్టమేమీ లేదని అనుకుంటే అదికూడా పొరపాటేనని కట్టప్ప వ్యాఖ్యానించాడు.
మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చాక కమల్ హాసన్ రజనీకాంత్ ఇద్దరికీ తోటి నటులు నుంచే విమర్శలు ఎదురుకావడం గమనార్హం. ఆ మధ్య విజయ కాంత్ శరత్ కుమార్లు కూడా ఇదేవిధంగా వీరిద్దరిపై విరుచుకుపడిన విషయం తెలిసిందే.