“ఫిట్నెస్ చాలెంజ్”ల పేరుతో కొద్ది రోజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హడావుడి చేస్తున్నారు. తనకు నచ్చిన సెలబ్రిటీలకు .. రాజకీయ నేతలకు సోషల్ మీడియా ద్వారా ఈ సవాళ్లు చేస్తున్నారు. యోగా దినోత్సవం దగ్గర పడుతూండటంతో మరింత జోరు పెంచారు. కానీ ప్రధాని చేస్తున్న ఈ చాలెంజ్‌లు ప్రజల్లో తీవ్ర విమర్శలకు కారణం అవుతున్నాయి. విపక్ష నేతలు ముందుగా దేశ ప్రజలకు ప్రధాని సృష్టించిన సమస్యలను పరిష్కరించాలనే సవాల్‌ను చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ చాలెంజ్‌కు మోదీ స్పందించినప్పుడే.. రాహుల్ గాంధీ.. పెట్రోల్, డిజిల్ ధరలపై సమస్యపై చాలెంజ్ విసిరారు. కానీ ప్రధాని మోదీ స్పందించ లేదు.
తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఆయన ఫిట్నెస్ చాలెంజ్ చేశారు. దానికి కుమారస్వామి రిప్లయ్ ఇచ్చారు. ఆ రిప్లయ్ ఎలా ఉందంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ… పరిష్కరించాల్సిన సవాళ్లను పరిష్కరించకుండా… ఇతర చాలెంజ్‌లపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఉందని అర్థం వచ్చేలా ట్వీట్ పెట్టారు. ముఖ్యమంత్రిగా తన ఆలోచన …తన ఆరోగ్యం కన్నా.. ఎక్కువగా రాష్ట్రంపైనే ఉందని రిప్లయ్ ఇచ్చారు. ప్రస్తుతం కర్ణాటకలో అభివృద్ధి ఫిట్నెస్ కోసం చూస్తోందని.. అందుకు కేంద్ర సహకారం ఎంతో అవసరమని..ఆ సవాల్‌ను నిర్వర్తించాలనే అర్థంలో … కుమారస్వామి రిప్లయ్ ఇచ్చారు. అలాగే సమాఖ్య వ్యవస్థలో కేంద్రం రాష్ట్రాలకు అండగా ఉండాల్సి ఉంటుందని… ఆ సవాల్‌ను నిర్వర్తించాలన్నట్లుగా కుమారస్వామి ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి మోదీ ట్వీట్‌కి కుమారస్వామి ఇచ్చిన ట్వీట్ రిప్లయ్ వైరల్ అయిపోయింది. మోదీ తన ఫిట్నెస్ గురించి… తీసుకునేంత శ్రద్ధ.. దేశం ఫిట్నెస్ కోసం తీసుకోవడం లేదని విపక్ష పార్టీల నేతలు.. విమర్శలు ప్రారంభించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం.. ఈ విమర్శలను పట్టించుకోవడం లేదు. తన చాలెంజ్‌లు తాను చేసుకుంటూనే వెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ “హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్” పేరుతో ఓ క్యాంపెన్ ప్రారంభించి మొదటగా విరాట్ కోహ్లీకి చాలెంజ్ చేశారు. కోహ్లీ ప్రధానికిచాలెంజ్ చేశారు. దీన్ని ఒడుపుగా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలు ప్రధానమమంత్రి నరేంద్రమోదీపై వస్తున్నాయి..!