కొంతమంది దర్శకుల మీద కొన్ని ముద్రలు వద్దన్నా పడిపోతుంటాయి. వాళ్లు ఎంచుకునే కథలు, వాటిని చూపించే విధానం అందుకు కారణం. సతీష్ వేగేశ్న పై కూడా అలాంటి ముద్ర ఒకటుంది. ఆయన ఫ్యామిలీ కథలు తీస్తారని, క్లాస్‌కి నచ్చేలా ఉంటాయని జనాలు ఫిక్సయిపోతారు. శతమానం భవతి అందుకు పెద్ద ఉదాహరణ. ఆ తరవాత శ్రీనివాస కల్యాణంలోనూ అదే పంథా కనిపించింది. ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమాకి `ఎంత మంచి వాడవురా` అనే క్లాస్ టైటిల్ పెట్టారు. సినిమా కూడా అదే స్టైల్లో క్లాస్ గా ఉంటుందనుకుంటున్నారంతా. కానీ.. ఈ సినిమాలోని మాస్ అప్పీల్‌ని కొంచెం కొంచెం చూపించడం మొదలెట్టాడు సతీష్.
టీజర్లోనే కాస్త యాక్షన్ డోస్ చూపించారు. ఆ తరవాత.. మాస్‌ని దృష్టిలో ఉంచుకుని ఓ పాటని వదిలారు. ఇప్పుడు పోస్టర్లలో హీరోయిజం చూపిస్తున్న స్టిల్స్ వదులుతున్నారు. చూస్తుంటే సతీష్ కాస్త రూటు మారుస్తున్నట్టే అనిపిస్తోంది. హీరోని బట్టి, వాళ్లపై ప్రేక్షకులకు ఉండే అంచనాల్ని బట్టి దర్శకులు ఊడా కాస్త మారుతూ ఉండాలి. కల్యాణ్ రామ్ కోసం ఒకట్రెండు ఫైట్లు, పాటలు మాసీగా ట్రై చేసినా ఫర్వాలేదు. పైగా ఈ సినిమా సంక్రాంతి సీజన్లో వస్తోంది. క్లాసు, మాసు అందరినీ దృష్టిలో ఉంచుకుని సినిమా చేయాలి. సతీష్ కూడా అలానే ప్రయత్నించాడేమో. మరి ఈ క్లాస్ డైరెక్టర్ మాస్ విన్యాసాలు వర్కవుట్ అయ్యాయో లేదో తెలియాలంటే 15 వరకూ ఆగాల్సిందే.