ఏపీలో వైసీపీ నేతగా చెలామణి అవుతూ అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న సత్తారు వెంకటేష్ రెడ్డిని అమెరికాలోని మిస్సోరి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇరవై ఏళ్ల యువకుడ్ని చదువు పేరుతో అమెరికాకు తీసుకు వచ్చి ఇంట్లో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. చెప్పిన మాట వినకపోతే ఇష్టం వచ్చినట్లుగా దాడి చేస్తున్నాడు. పీవీసీ పైపులతో కొడుతున్నారు. రోజుకు కనీసం మూడు గంటలుకూడా నిద్రపోనీయకుండా పని చేయించుకుంటూ… పదే పదే హింహిస్తూండటంతో ఆ ఇరవై ఏళ్ల యువకుడు పూర్తిగా బలహీనపడ్డాడు. ఇతని పరిస్థితి చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్తారు వెంకటేష్ రెడ్డితో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు.
సెయింట్ చార్లెస్ కౌంటిలోని ఓ ఇంట్లో యువకుడ్ని హింహిస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో ఆ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో వాళ్లు పోలీసుల్ని లోపలికి మొదట అనుమతించలేదు. తర్వాత పోలీసులు బలవంతంగా వెళ్లి చూడటంతో ఓ యువకుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు తెలుగు యువకుల్ని అరెస్టు చేశారు. పెనుమచ్చ శ్రబన్, పెన్మత్స నిఖిల్ అనే వారిని అరెస్టు చేశారు. బాధితుడ్ని హింసిస్తున్న అసలు వ్యక్తి సత్తారు వెంకటేష్ రెడ్డి అని గుర్తించి అతడ్ని వెరే ఇంట్లో అరెస్టు చేశారు. ముగ్గుర్నీ జైలుకు తరలించారు.
బాధిత యువకుడ్ని చదువు పేరుతో అమెరికాకు తీసుకు వచ్చి వెట్టి చారికి చేయిస్తున్నాడు సత్తారు వెంకటేష్ రెడ్డి. అన్ని రకాల పనులను చేయించుకునేవాడు. మూడుగంటల కన్నా ఎక్కువ నిద్రపోనిచ్చేవాడు కాదు. సరైన తిండి పెట్టేవాడు కాదు. కటిక నేత మీద పడుకోమని చెప్పేవాడు. తనపై ఎప్పుడూ సీసీ కెమెరా నిఘా పెట్టి ప్రతి పనిలోనూ తప్పును వెదికి దండించేవాడు. అయితే ఆ యువకుడికి అమెరికాలో ఎవరూ తెలియదు. చివరికి ఓ పొరుగు వ్యక్తి పరిస్థితిని గమనించాడు. ఏమైనా సాయం కావాలంటే చెప్పాలని తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. తనను ఇలా హింహిస్తున్నారని చెప్పడంతో ఆ పొరుగు వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చి బాధితుడ్ని కాపాడారు. నిందితులు ముగ్గుర్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిపై హ్యూమన్ ట్రాఫికింగ్ తో పాటు , బానిసత్వం చేయించుకునేందుకు అక్రమ రవణా, దాడిచేయడం, కిడ్నాప్ చేయడం, గృహ హింస, క్రిమినల్ చర్య వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసి జైల్లో వేశారు.
వెంకటేష్ రెడ్డి తనను తాను చాలా పవర్ ఫుల్ అని అమెరికాలోనూ దందాలు చేస్తూంటారు. ఆయన తాను వైసీపీకి పని చేస్తున్నానని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. పలు వైసీపీ కార్కక్రమాల్లోనూ పాల్గొన్న వీడియోలను తన వెబ్ సైట్ లో పెట్టుకున్నారు.