సత్యపాల్ మాలిక్.. జాతీయ రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఈ పేరు ఖచ్చితంగా తెలుసు. జమ్మూకశ్మీర్ గవర్నర్ గా ఉన్న ఆయన ఇటీవలి కాలంలో మోదీకి వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ గా ఉన్నప్పుడు ఓ ప్రాజెక్టు కోసం తనకు మూడువందల కోట్లు లంచలం ఇవ్వబోయిదని కూడా ప్రకటించి సంచలనం రేపారు. తాజాగా ఆయన గత ఎన్నికలకు ముందు జరిగిన పుల్వామా దాడి గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
సైనికుల్ని అలా రోడ్డు మార్గంలో పంపడం సరి కాదని ఎయిర్ లిఫ్ట్ చేయాలని తానుసూచించినా మోదీ, అమిత్ షా పట్టించుకోలేదన్నారు. ఘటన తర్వతా తనను దాని గురించి మాట్లాడవద్దన్నారని ప్రకటించారు. అంతే కాదు.. అదంతా అసలు కేంద్రం వైఫల్యమేనన్నట్లుగా మాట్లాడారు. పాకిస్థాన్ నుంచి పూర్తి స్థాయిలో పేలుడుపదార్థాలతో వచ్చిన ట్రక్కు స్వేచ్చగా కీలక ప్రాంతాల్లో తిరిగిందన్నారు. కానీ గుర్తించలేకపోయారని ఆరోపించారు. సత్యపాల్ మాలిక్ మాటలు సంచలనం అయ్యాయి. దీనికి కారణం పుల్వామా ఘటన ను బేస్ చేసుకుని బీజేపీ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు.
అయితే దీన్ని మీడియా పెద్దగా కవరేజీ ఇవ్వలేదు. కానీ ఓ సెక్షన్ మీడియా కవరేజీ ఇచ్చి.. సోషల్ మీడియాలో ఉద్ధృతంగ ాఈ అంశంపై చర్చ ప్రారంభమయ్యే సరికి.. యూపీ నుంచి లైవ్ మర్డర్స్ ఘటన సంచలనం అయింది. మీడియా ఎదుటే.. ఇద్దరు గ్యాంగ్ స్టర్లను… పోలీసులు అందరూ ఉండగానే పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. సినిమాల్లో జరిగినట్లుగా అది జరిగిపోయింది. అంతకు ముందే ఆ గ్యాంగ్ స్టర్ ను మట్టిలో కలిపేస్తామని ముఖ్యమంత్రి యోగి అన్న మాటల్ని.. ఈ మర్డర్స్ ను చూపించి… విస్తృతమైన ప్రచారం ప్రారంభించేశారు. దీంతో సత్యపాల్ మాలిక మాటలు కనుమరుగు అయిపోయాయి.
దేశంలో ఏ వార్తల్ని హైలెట్ చేయాలో.. వేటిని మరుగున పర్చాలో.. ఇప్పుడు మీడియాను నియంత్రించే అధికార పార్టీలకు అర్థమైపోయింది. ఈ ఫార్ములానుపర్ ఫెక్ట్ గా పాటిస్తున్నారు. టాపిక్ ను మార్చేస్తున్నారు. నిజాలు కన్వీనియంట్‌గా మరుగున పడేస్తున్నారు.