అఖిల్, హలో సినిమాలో అఖిల్ బాగా డిస్ట్రబ్ అయ్యాడు. కథల ఎంపికలో లోపాలేమిటో తెలిసొచ్చాయి. ఆ తప్పుల్ని మరోసారి చేయకుండా చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. స్టార్ దర్శకులు అంటూ వెంట పడకుండా, కొత్త కథల్ని, కొత్త దర్శకుల్నీ నమ్ముతున్నాడు. `తొలిప్రేమ` దర్శకుడు వెంకీ అట్లూరితో అఖిల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే అఖిల్ చేయబోయే సినిమాపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. రవిరాజా పినిశెట్టి తనయుడు సత్య పినిశెట్టి కూడా ఓ దర్శకుడే అనే సంగతి తెలిసిందే. సత్య ఇప్పుడు అఖిల్ కోసం ఓ కథ తయారు చేసుకున్నాడట. అది ఈమధ్యే అఖిల్‌కీ వినిపించారని సమాచారం. ఆ కథ అఖిల్‌కి బాగా నచ్చిందని… `కథ బాగుంది స్క్రిప్టు రెడీ చేయండి` అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ కథకు సత్యనే దర్శకత్వం వహిస్తాడా, లేదంటే మరో దర్శకుడ్ని ఎంచుకుంటారా? అనేది చూడాలి. `మలుపు` అనే చిత్రంతో ఆకట్టుకున్నాడు సత్య. ఆ సినిమా కమర్షియల్‌గా ఆడకపోయినా… విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈసారి మాత్రం వాణిజ్య విలువలున్న కథనే రాసుకున్నాడట. మరి ఈసినిమాని ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చూడాలి.