హీరోగా నటిస్తూనే … తనకు నచ్చిన పాత్రలు వచ్చినప్పుడు ఏ మాత్రం భేషజాలకు పోకుండా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకు హద్దులు లేవని నిరూపిస్తున్నాడు సత్యదేవ్. ఈ మధ్యే గాడ్ ఫాదర్ లో గుర్తుండిపోయే అభినయాన్ని ప్రదర్శించి చిరంజీవి దగ్గర కూడా మార్కులు కొట్టేసాడు. ఈలోగా బాలీవుడ్ లో సత్యదేవ్ నటించిన సినిమా ఒకటి రిలీజ్ అయ్యింది. అదే… రామసేతు. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా హిందుత్వ కధలకు, పురాణ, ఇతిహాస నేపధ్య చిత్రాలకు డిమాండ్ పెరిగిన సందర్భంగా రామ్ సేతు కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని, బాలీవుడ్ లో సత్యదేవ్ కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశించారు. ఐతే దీపావళికి విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అక్షయ్ ఇమేజ్, హిందూ సెంటిమెంట్ ఏమీ ఈ సినిమాని కాపాడలేకపోయాయి.
ఇందులో సత్యదేవ్ పాత్రకు మంచి మైలేజి వున్నా, ఆ పాత్రలో సత్యదేవ్ విశేషంగా రాణించినా… సినిమా ప్లాప్ అయ్యేసరికి సత్యదేవ్ కష్టం వృధా అయ్యింది. ఐతే… భవిషత్తు లో సత్యదేవ్ కి బాలీవుడ్ నుంచి మరిన్ని అవకాశాలు వచ్చినా షాక్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే… బాలీవుడ్ ఇప్పుడు సౌత్ నటులపై కన్నేసింది. వాళ్లకు మంచి పాత్రలు ఇచ్చి, తద్వారా సౌత్ మార్కెట్ ని ఆకర్షించాలని చూస్తోంది. అందుకే సత్యదేవ్ లాంటి నటులకు అక్కడ మరింత డిమాండ్ ఏర్పడింది.