అలనాటి అద్భుత నటి సావిత్రి కథని వెండి తెరపై సినిమాగా మలుస్తున్నాడు నాగ అశ్విన్. సావిత్రి కథంటే అలాంటిలాంటి బయోపిక్ కాదు. ఓ తరం.. సినిమా చరిత్ర! ఓ కుర్ర దర్శకుడు… ఇంత పెద్ద సాహసం చేస్తున్నాడంటే.. నిజంగా అబ్బురమే. మరో దర్శకుడెవరైనా అయితే ఈ బయోపిక్‌పై లేనిపోని అనుమానాలు వచ్చేవి. ఎవడే సుబ్రమణ్యంతో ఓ హృద్యమైన కథ చెప్పిన నాగ అశ్విన్ ఈ ప్రాజెక్టు చేపట్టడంతో… సావిత్రి కథపై నమ్మకం ఏర్పడింది. పైగా ఇది అశ్వనీదత్ చిత్రం. ఆయన ఏ విషయంలో అయినా పక్కాగా ఉంటారు. స్ర్కిప్టుపై నమ్మకం రాకపోతే.. ఈ సాహసానికి ఆయన ఒడిగట్టరు. సమంత, కీర్తి సురేష్‌ల రాకతో ఈ ప్రాజెక్టుకు కొత్త సొగసొచ్చింది. అంతా బాగానే ఉంది. కానీ… నాగ అశ్విన్ ఓ మెగా అబద్ధం ఆడేశాడు. ఓ ఇంటర్వ్యూలో నాగ అశ్విన్ మాట్లాడుతూ ”సావిత్రి పాత్ర కోసం చాలామందిని అనుకొని చివరికి కీర్తి సురేష్‌ని ఫిక్సయ్యాం. అయితే నిత్యమీనన్ పేరు ప్రస్తావనకు రాలేదు. మీడియాలో ఆ పేరు ఎలా బయటకు వచ్చిందో తెలీదు” అనేశాడు.
అది మాత్రం పచ్చి అబద్ధమే. ఈ స్క్రిప్టు ముందు నిత్య దగ్గరకే వెళ్లింది. నిత్యకు బాగా నచ్చేసింది. కానీ.. ఆమె మితిమీరిన జోక్యం వల్ల… నిత్యని పక్కన పెట్టాల్సివచ్చింది. నిత్య తప్పుకొన్న తరవాతే ఈ కథ కీర్తి, సమంత దగ్గరకు వెళ్లింది. అసలు మేం నిత్యని కలవలేదు, ఈ కథ గురించి చెప్పలేదు అని ఈజీగా చెప్పేస్తున్నాడు నాగ అశ్విన్. కాకపోతే.. ఓ విషయంలో మెచ్చుకొని తీరాలి. కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ చూసే కీర్తి సురేష్‌ని సావిత్రి పాత్ర కోసం ఎంపిక చేశామన్న నిజాన్ని ఒప్పుకొన్నాడు. సావిత్రి పాత్రలో ఎలా నటిస్తుందో తెలియకుండానే ఆమెని తీసుకొన్నాం.. అని మొహమాటం లేకుండా చెప్పేశాడు. నిత్యమీనన్, సమంత లతో ఆ పాత్ర చేయిస్తే.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. అందుకే ఓ కొత్త నటిని మహానటిగా మారిస్తే.. అంచనాలు తగ్గిపోతాయి. నాగ అశ్విన్ ఎత్తుగడ అదే. అందుకే నిత్యని పక్కన పెట్టాడు. సమంతకి మరో పాత్ర కట్టబెట్టాడు. ఇక చేయాల్సిందొక్కటే. కీర్తి సురేష్‌ని సావిత్రి గా మర్చడం. ఆ విషయంలో నాగ అశ్విన్ ఎంత వరకూ విజయం సాధిస్తాడో చూడాలి.