ఈనాడు ఏ హీరో కూడా లేనంత బిజీగా ఉన్న హీరో నారా రోహిత్, తాజాగా ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో పరిచయమై మెప్పించిన దర్శకుడు పవన్ సాదినేని తో, ప్రేమ కథా చిత్రం ఫేం నందిత రాజ్ హీరోయిన్ గా విజన్ ఫిలిం మేకర్స్ పతాకం పై నిర్మించిన చిత్రం ‘సావిత్రి’. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..
కథ :
రిషి (నారా రోహిత్) ఓ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ లో వుండే యువకుడు .. డాక్టర్ చదివనా తను సరదా జీవితాన్ని గడుపుతుంటాడు. తను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాన్ని వెతికే ఈ హీరో కొద్దిగా అల్లరి చిల్లరగా కూడా ఉంటాడు. సినిమా తన మేనత్త పెళ్ళి పెళ్లితో మొదలవుతుంది. అదే టైం లో సావిత్రి జన్మిస్తుంది. మొదట పుట్టిన దానికి తల్లిగారి తరపున పేరు పెట్టారని ఈసారి పుట్టబోయే బిడ్డకు తన తల్లి పేరు పెట్టాలని అనుకుంటాడు దొరబాబు (మురళి శర్మ). అనుకున్నట్టుగానే అమ్మాయి పుట్టడం సావిత్రి అని నామకరణం చేయడం జరుగుతుంది.ఇక అదే సమయంలో దొరబాబు చెల్లిని చేసుకోవాలని భీష్మా రావు (రవి బాబు) ప్రయత్నిస్తాడు. కాని కృష్ణ (అజయ్) తనకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. ఆ తర్వాత కథ 20 సంవత్సరాల ఫాస్ట్ ఫార్వార్డ్ అవుతుంది. సావిత్రి (నందిత రాజ్ ) చలాకీ గల పిల్ల చిన్నప్పటి నుండి తనకు పెళ్లి మీద ఓ మోజు.. తనని పెళ్లి కూతురిగా ఎప్పుడు చేస్తారా అని చూస్తుంటుంది. అక్కకు ఇష్టం లేకున్నా ఆమె పెళ్ళి జరిగేందుకు తోడ్పడుతుంది. అంతగా పెళ్ళిని ఇష్టపడే సావిత్రికి ఓ మొక్కుపై షిర్డీకి వెళ్ళే క్రమంలో రైలులో రిషి (నారా రోహిత్) పరిచయమవుతాడు.ఇక తన అక్క గాయత్రి (ధన్యా బాలకృష్ణన్) పెళ్లి ఫిక్స్ అవ్వగా దాన్ని కాదనుకుని వెళ్లిపోవడంతో బాబాయ్ కృష్ణకు ఫోన్ చేసి ఆమెను మరళా ఇంటికి రప్పించి ఇంటి పరువు కాపాడేలా చేస్తుంది. అయితే రిషి అసలు సావిత్రి జీవితంలోకి ఎలా వచ్చాడు..? పెళ్లి పెళ్లి అని కలవరించే సావిత్రికి పెళ్లి జరిగిందా..? లేదా..? రిషికు దొరబాబు ఫ్యామిలీకు ఉన్న సంబంధం ఏంటి..? తమ్ముడు కృష్ణ గురించి దొరబాబు తెలుసుకున్న నిజం ఏంటి..?అన్నదే మిగతా కథ…
నటి నటుల పెర్ఫార్మన్స్:
నారా రోహిత్ అనగానే మొన్నటిదాకా కామెడీ వగైరా వర్క్ అవుట్ అవ్వవు అన్నది నిన్న మొన్నటి టాక్. తుంటరితో ఆ టాక్ కు కాస్త దూరం వచ్చేలా చేసుకున్న నారా రోహిత్ ఈ సినిమాలో తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. తన పాత్రకు స్కోప్ ఉన్నంత వరకు బాగానే వర్క్ అవుట్ చేశాడు.కొన్ని సీన్స్ లో కేవలం సన్నివేశాల కన్నా డైలాగ్స్ మాత్రమే బలవైనవిగా అనిపిస్తాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే సావిత్రిని నారా రోహిత్ వన్ మ్యాన్ షోలా చేశాడు. ఓ పక్క సావిత్రిలా నందిత తెగ అల్లరి చేస్తున్నా మనసులో ఉన్న ప్రేమను చంపుకుని నటించే పాత్రలో రోహిత్ ఓకే అనిపించుకున్నాడు. అయితే ఎప్పటిలానే యాక్టింగ్, ఫైట్స్ లో ఓకే అనిపించినా డ్యాసుల్లో మాత్రం చాల నిరాశ పరచేలా చేశాడు.ఇక సినిమాలో సావిత్రిగా టైటిల్ రోల్ చేసిన నందిత పర్వాలేదనిపించింది. తనకు కచ్చితంగా ఏం తెలియని ఓ కన్ ఫ్యూజ్ పాత్రలో ఓకే అనిపించినా అక్కడక్కడ ఇంకా నందిత మెరుగు చెందాలసిన అవసరం ఉంది అనిపిస్తుంది. సినిమా మొత్తం తన మీదే నడుస్తుంది కాబట్టి సినిమాకు తన బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడంలో కాస్త వెనుకపడ్డది నందిత. ఇక పెళ్లంటే మోజుతో ఎలాంటి వాడినైనా చేసుకుంటానని చెప్పే తన క్యూట్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఇక దొరబాబు పాత్రలో మురళి శర్మ పాత్రకే అందం వచ్చేలా చేశాడు. తన చుట్టూ అంతా మంచే జరుగుతుంది అనుకుని భావించే పాత్రలో చక్కగా నటించాడు. ఇక దొరబాబు తమ్ముడు కృష్ణగా అజయ్ మరోసారి తన యాక్టింగ్ పవర్ ఏంటో చూపించాడు. సినిమాలో చాలా తక్కువ స్కోప్ ఉన్న పాత్రే అయినా సినిమాను నడిపించేది కృష్ణ పాత్రే. చివరగా వచ్చే మురళి శర్మ, అజయ్ ల సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సావిత్రి ఇంట్లో పనిచేసే కమెడియన్‌గా నటించిన ప్రభాస్ శ్రీను మంచి కామెడీ పండించారు. సినిమాలో పోసాని కృష్నమురళి కృష్ణుడిగా కాసేపు, సావిత్రిని పెళ్లి చేసుకోబోయే ఎన్నారైగా వెన్నెల కిశోర్ కాసేపు నవ్వులు పండిచారు.
సాంకేతిక విభాగం :
సావిత్రి సినిమా గురించి ముందుగా చెప్పుకోవాల్సి వస్తే సినిమా దర్శకుడు పవన్ సాధినేని.. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో పర్వాలేదనిపించుకుని.. సినిమా కథ సినిమామీద తనకున్న కమిట్మెంట్ బాగా కనబడ్డాయి. సినిమా దర్శకుడిగా ఓకే అనిపించుకున్నా కథ కథానాల్లో కొత్త దనం లోపించడం కనబడుతుంది.. తనకొచ్చిన మంచి ఆఫర్ ను చాలా రిచ్ గా సినిమా తీసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక శ్రవణ్ సంగీతం సినిమా చూస్తున్నంత సేపు ఓకే కాని థియేటర్ నుండి బయటకు వస్తే ఒక్క పాట గుర్తుండదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓకే . వసంత్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించినా సినిమాలో లొకేషన్స్ ఎక్కువ లేకపోవడంతో కాస్త కలర్ ఫుల్ గా అనిపించదు. హీరో హీరోయిన్ ను గ్లామర్ గా చూపించడంలో కెమెరా మెన్ వసంత్ పాస్ అయ్యాడు. ఇక సినిమాకు ఎడిటింగ్ చేసిన గౌతం నెరుసు ఇంకా బాగా వర్క్ చేయాలి . సినిమా మరి ఫ్లాట్ గా అనిపించేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. సినిమా నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ తన టేస్ట్ ను సినిమాలో చూపించారు. ప్రొడక్షన్ లో ఎక్కడ సినిమా రిచ్ నెస్ కోల్పోలేదు.
విశ్లేషణ :
తెలుగు సినిమాకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఒక ఫార్ములా ఉంది. దర్శకుడు పవన్ సాధినేని హీరోయిన్ కు పెళ్లంటే ఇష్టం అన్న పాయింట్ తో మొదలు పెట్టి.. ఆమెను పెళ్లి చేసుకోడానికి 20 ఏళ్లుగా ఓ విలన్ రెడీగా చేసుకుని.. ఆమెకు ఓ ప్రయణంలో అనుకోకుండా ఓ హీరోని పరిచయం చేసి ఇలా రకరకాలుగా కన్ ఫ్యూజ్ చేస్తూ ఆడియెన్స్ కి క్లారిటీ మిస్ అయ్యేలా చేశాడు. ఒక లైన్ రాసుకుని దానికి బలమైన డైలాగులు రాసుకున్నాడు కాని ఆ బలమైన మాటలకు తగ్గ సన్నివేశాలు రాయడంలో మిస్ అయ్యాడు. మొదటి భాగం మొత్తం హీరో హీరోయిన్ ని చూడటం ఆమె ను ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఓ ప్రేమ జంటను కలపడం అంతా కాస్త బోర్ కొడుతుంది. మధ్యలో పోసాని ఎపిసోడ్ ప్రేక్షకులకు అంతగా నవ్వులు పండించదు కాదు కదా విసుగు తెప్పిస్తుంది. సినిమా కచ్చితంగా పాయింట్ ఇది అని దర్శకుడు దాన్ని ప్రేక్షకులకు చేరువేయడంలో విఫలమయ్యాడు. నారా రోహిత్ ఇలాంటి పాత్ర లో ఇంకా తన డైలాగ్ మాడ్యులేషన్ లో మెళుకువలు నేర్చుకోవాల్సి ఉంది. అయితే ఇందులో కొత్తదనం ఏంటంటే హీరోయిన్ పాత్రకుండే ఓ విచిత్రమైన ఆలోచనా విధానంతో ఆ కథ చెప్పడం. ఈ విషయాన్నే మేజర్ హైలైట్‌గా చేసుకున్న ఈ సినిమాలో నటీనటుల ప్రతిభ, క్లైమాక్స్‌లో వచ్చే మంచి ఎమోషనల్ సీన్ హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇకపోతే సెకండాఫ్‌లో కథ వేగం నెమ్మదించడం, ఈ సమయంలో వచ్చే కొన్ని బోరింగ్ ట్రాక్స్, అనవసర ఫైట్స్, సన్నివేశాలను మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. మరి బోర్ కొడుతుంటే ఏదో టైం పాస్ కు ఓ సినిమా చూద్దాం అనుకునే వారికి సావిత్రి నచ్చే అవకాశం ఉంది.ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫార్ములా సినిమానే అయినా ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు .
తెలుగు360.కామ్ రేటింగ్ 2/5
బ్యానర్ : విజన్ ఫిలిం మేకర్స్
నటి నటులు : నార రోహిత్, నందిత రాజ్,పోసాని కృష్ణ మురళి, అజయ్ , రవి బాబు, జీవా, వెన్నెల కిశోర్, ‘సత్యం’ రాజేష్, శ్రీ ముఖి, ధన్యా బాలకృష్ణన్, మధు నందన్ , శక లక శంకర్, ప్రభాస్ శ్రీను తది తరులు….
సినిమాటోగ్రఫీ :ఏ .వసంత్,
సంగీతం : శ్రావణ్,
మాటలు : కృష్ణ చైతన్య
ఎడిటింగ్ : గౌతం నేరుసు,
నిర్మాత : డా || వి బి రాజేంద్ర ప్రసాద్,
కథా, స్క్రీన్ ప్లే , దర్శకత్వం : పవన్ సాదినేని
విడుదల తేది :01.04.2016