నారా రోహిత్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా సావిత్రి.. ఏప్రిల్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నారా రోహిత్ కు సోలో లాంటి హిట్ ఇచ్చే సినిమాగా ఈ సావిత్రి రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా దర్శకుడు పవన్ సాధినేని ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. నారా రోహిత్ తో పాటుగా నందిత నటిస్తున్న ఈ సినిమా టైటిల్ సావిత్రి అని పెట్టడం జరిగింది.
అయితే సినిమా టైటిల్ గురించి దర్శకుడితో తన స్నేహితులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారట. సావిత్రి అనేది క్లాస్ టైటిల్ లా ఉందని.. మాస్ ఆడియెన్స్ ఈ సినిమా చూసేందుకు సాహసించరని తనతో అన్నారట. అయితే కథ కథనాల దృష్ట్యా ఈ సినిమాకు సావిత్రి అనే టైటిల్ సూట్ అవుతుందని పెట్టామని జబాబిచ్చాడట. సినిమా టైటిల్ బట్టి కాదు సినిమాలో కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ఆదరించే మంచి మనసు తెలుగు ప్రేక్షకులకు ఉంది అంటున్నాడు పవన్ సాధినేని.
ప్రేమ ఇష్క్ కాదల్ తో తొలి దర్శకుడిగా తన టాలెంట్ తో అందరిని ఇంప్రెస్ చేసిన పవన్ సాధినేని నారా రోహిత్ సావిత్రితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. రీసెంట్ గా తుంటరి అంటూ వచ్చి పర్వాలేదనిపించుకున్న రోహిత్ ఈ సావిత్రిని ఎలా ప్రేక్షకులకు చేరవేస్తాడో మరి.