ప్రస్తుతం నాగచైతన్య, సమంత గోవాలో వున్నారు. మ్యాగ్జిమమ్ ఈ వీకెండ్‌కి అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చాక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని ‘సవ్యసాచి’లో చివరి పాట షూటింగ్ కోసం నాగచైతన్య విదేశాలు వెళ్తారు. మహా అయితే మూడు నాలుగు రోజుల్లో షూటింగ్ కానిచ్చేస్తారు. పాటతో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి కొంచెం టైమ్ పడుతుంది. నిర్మాతలు చెప్పినదాని ప్రకారం చూసుకున్నా సెప్టెంబర్ 15కి పూర్తవుతుంది. ఆ తరవాత సినిమా విడుదల చేయాలంటే చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ చివర్లో నాగార్జున ఒక హీరోగా నటించిన ‘దేవదాస్’ వస్తుంది. అది వచ్చిన రెండు మూడు వారాలకు విడుదల చేద్దామంటే అక్టోబర్‌లో విజయదశమి కానుకగా ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ లైనులో వుంది. రామ్ ‘హలో గురూ ప్రేమ కోసమే’, విశాల్ ‘పందెం కోడి 2’ కూడా అక్టోబర్‌లో రిలీజ్ డేట్స్‌పై కర్చీఫ్ వేశాయి. ‘సవ్యసాచి’కి మిగతా సినిమాలతో పోటీ ఎందుకని ఏకంగా విడుదల తేదీని నవంబర్‌కి రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారు. నవంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో ‘సవ్యసాచి’ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
పాపం… ‘సవ్యసాచి’ సినిమా ఓ ముహూర్తాన మొదలైందో కానీ ఏదీ కలసి రావడం లేదు. మొదట్లో మాధవన్కి షోల్డర్ ఇంజ్యూరీ కావడంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది. తరవాత గ్రాఫిక్ వర్క్ కోసం తీసిన సీన్లు బాగోలేదని, ఇంకొకటని రీషూట్లు చేయడంతో ఇంకొంత ఆలస్యం అయ్యింది. కిందామీదా పడి షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా విడుదలకు సిద్ధం చేద్దామంటే ‘శైలజారెడ్డి అల్లుడు’ అడ్డు పడ్డాడు. చివరికి, షూటింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి మిగతా సినిమాలు వున్నాయి. దాంతో మరింత వెనక్కి వెళ్లి నవంబర్ నెలలో సినిమాని విడుదల చేస్తున్నారు.