డీజీపీ పోస్ట్ నుంచి ఉద్వాసనకు గురైన గౌతం సవాంగ్‌ను అసలు పోలీసు శాఖతో సంబంధం లేని అనూహ్యమైన పోస్టింగ్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఎపీపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కావడంతో ఆయన నియామక ఉత్తర్వులను గవర్నర్‌కు పంపారు. గవర్నర్ ఆమోద ముద్ర పడిన తర్వాత సవాంగ్ పదవి కాలం ప్రారంభమవుతుంది. ఎపీపీఎస్సీ ఉద్యోగ నియామకాల సంస్థ. ఇందులో ఐపీఎస్ అధికారుల్ని నియమించడం చాలా అరుదు.
అకడమిక్ ఎక్స్‌పర్ట్స్‌ను ఎక్కువగా నియమిస్తూ ఉంటాయి. టీడీపీ ప్రభుత్వం జెఎన్టీయూలో ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఉదయ్ కుమార్‌ను నియమించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసింది. ఎలాంటి ఉద్యోగ నియామకాలూ చేపట్టకపోవడం… చేయాల్సిన పనులను ఇంచార్జి చైర్మన్‌ను నియమించి పూర్తి చేసేవారు. ఆయన ఆరు నెలల క్రితం రిటైరయ్యారు. తర్వాత ఆ పదవిని భర్తీ చేయలేదు. ఇప్పుడు గౌతం సవాంగ్‌కు కేటాయించారు.
ప్రస్తుతం ఏపీలో ఉద్యోగ నియామకాలు పరిమితంగా ఉన్నాయి.ఈ కారణంగా ఏపీపీఎస్సీలో ఉండే పని కూడా తక్కువే. కానీ అది రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో డీజీపీగా చేసిన గౌతం సవాంగ్‌కు ప్రభుత్వం కాస్త గౌరవం ఇచ్చిందనే అనుకోవాలి. రిటైరయ్యే వరకూ సవాంగ్ పదవిలో ఉంటారు. మధ్యలో ఆయనను తప్పించాలని అనుకున్నా ప్రభుత్వం వల్ల కూడా కాదు. నియామకం మాత్రమే ప్రభుత్వం చేతుల్లో ఉంది. తొలగింపు అంత తేలిక కాదు !