ఎపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన సవాంగ్ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. డీజీపీ పోస్టు నుంచి రిలీవ్ అయ్యారు. ప్రభుత్వం ఆయనకు పదవి ఇస్తూ ఉత్తర్వులిచ్చింది. “డీమ్డ్ టూ బి” నిబంధనతో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన రిజైన్ చేయకుండానే పదవీ బాధ్యతలు చేపట్టవచ్చని చెబుతున్నారు. అయితే సవాంగ్ ఇంత వరకూ బాధ్యతలు చేపట్టలేదు. దీనికి కారణం ప్రస్తుతం ఏపీపీఎస్సీ కార్యదర్శిగాఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు. ఆయనకు, సవాంగ్‌కు మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి.
తాను చైర్మన్ అయి.. ఆయన కార్యదర్శిగా ఉంటే పరిస్థితులు బాగుండవని ఆయనను తొలగించాలని సవాంగ్ కోరినట్లుగా కొన్నాళ్లుగాప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే రాత్రి చేసిన బదిలీల్లో పీఎస్ఆర్ ఆంజనేయులను ఇంటలిజెన్స్ చీఫ్‌గా నియమించారు. అహ్మద్ బాబును ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమించారు. దీంతో సవాంగ్ సమస్య ను ప్రభుత్వ పెద్దలు పరిష్కరించిటన్లుగా భావిస్తున్నారు. దీంతో సవాంగ్ ఇక బాధ్యతల్లోకి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
ఏపీపీఎస్సీ చైర్మన్‌ను డమ్మీ చేయాలంటే ఎలా చేయవచ్చో ఈ ప్రభుతవమే చేసి చూపించింది. టీడీపీ హయాంలో నియమితులైన ఉదయ్ భాస్కర్ అనే ప్రొఫెసర్‌కు ప్రభుత్వం కనీసం కుర్చీ కూడా లేకుండా చేసింది. ఏ నిర్ణయాలూ తీసుకోనివ్వలేదు. చివరికి ఆయన అనామకంగా రిటైర్ అయ్యారు. ఇప్పుడు సవాంగ్‌కు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అంచనా వేయడం కష్టం.