శ్రీవారి పరకామణి నుంచి భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీని దోచుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. రవికుమార్ అనే వ్యక్తి పొట్టలో ప్రత్యేక ఏర్పాటు చేసుకుని వాటిని తరలించినట్లుగా గుర్తించారు. గతంలోనే పట్టుకుని కేసులు పెట్టినా అదేదో సివిల్స్ కేసు అయినట్లుగా రాజీ చేసుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉందని మెల్లగా బయటకు వస్తోంది. రవికుమార్ కు చెందిన తిరుపతిలోని ఆస్తులను టీటీడీకి రాయించినా చెన్నైలోని ఆయనకు ఉన్న ఆస్తులను ఇతరులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ అంశాన్ని టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఓ పోలీసు అధికారి దగ్గరుండి ఈ సెటిమెంట్ చేశారని అంటున్నారు. అప్పటి సీవీఎస్వో ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు రవికుమార్ .. దోచిన శ్రీవారి సంపదఎంత.. అయన దగ్గర నుంచి ఆస్తులు రాయించుకున్న వారు ఎవరు అన్నది బయటకు రావాల్సి ఉంది. పరకామణి లో ఈ దొంగతనం బయటపడింది. బయటపడకుండా ఇంకెన్ని జరిగాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. టీటీడీ చైర్మన్ కూడా సీరియస్ గా తీసుకుంటారు. రవికుమార్ ఎలా విదేశీ కరెన్సీని తరలించగలిగారు.. ఎంత కాలం నుంచి అలా తరలిస్తున్నారు. వాటితో కొన్న ఆస్తులేవి అన్నదానిపై పూర్తి విచారణ చేయనున్నారు. ఆస్తులు రాయించుకున్న వారు అధికార పార్టీకి చెందిన వారు అయితే..సంచలనంగా మారేఅవకాశం ఉంది.