ఐఏఎస్ అధికారులు మాత్రమే టీటీడీ ఈవోగా ఉండాలి. ఇది రూల్. కానీ ఎక్కడో ఢిల్లీలో రక్షణ శాఖలో పని చేసుకునే ధర్మారెడ్డి టీటీడీలోకి ఎలా వచ్చారు ?. ఐదేళ్లుగా ఎలా పాతుకుపోయారు ?. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ రెడ్డి పదవుల్లో ఉన్నప్పుడే తిరుమలలో ఎందుకు తిష్ట వేస్తున్నారు ?. ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఈవో ధర్మారెడ్డి ఎంత అధర్మారెడ్డో అర్థం చేసుకోవచ్చు. .
టీటీడీ ఈవోగా నియామకంపై ఐఏఎస్ అధికారులకు అన్యాయం చేస్తున్నారని.. అర్హత లేని ధర్మారెడ్డికి పదవి ఇచ్చారని.. అయినా వారు ఎందుకు మాట్లాడటం లేదని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. . తన నియామకం చట్టబద్దమేనని.. ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తే ఏదైనా చట్టబద్దం అయినట్లేనని ధర్మారెడ్డి అనుకుంటున్నారు.
ఆయనకు అర్హత లేదు కాబట్టే అదనపు ఈవోగా నియమించారు. ప్రస్తుతానికి ఈవో లేరు. ఆయనే అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. క్యాడర్ ప్రకారం ఈవో పదవి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి.. అసలు ఈవోను నియమించకుండా.. అదనపు ఈవోగా ధర్మారెడ్డిని ఉంచి ఆయన ద్వారా పరిపాలన చేస్తున్నారు. ఆ పరిపాలన మరో రెండేళ్లు సాగనుంది. ఈ మధ్యలో ప్రభుత్వం ఎవరినైనా ఈవోగా నియమించిన ఆయన డమ్మీగానే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ధర్మారెడ్డి అంత పవర్ ఫుల్ మరి. తాజాగా ఆయన పదవీ కాలం పొడిగింపు కోసం సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు చేస్తే అదే అనుకోక తప్పదు.
ధర్మారెడ్డి అసలు సివిల్ సర్వీస్ కాదు. ఆయన రక్షణ శాఖ ఉద్యోగి. ఆయనను రాష్ట్ర సర్వీసుల్లోకి డిప్యూటేషన్ మీద పంపడమే విచిత్రం. కానీ వైఎస్ హయాంలో ఓ సారి తీసుకు వచ్చి టీటీడీలో పెట్టారు. అప్పట్లో వివాదాస్పద పరిస్థితుల్లో ఆయను తప్పించాల్సి వచ్చింది. జగన్ సీఎం కాగానే మళ్లీ ఆయనను రక్షణ శాఖ నుంచి టీటీడీలో పెట్టారు. ఆయన డిప్యూటేషన్ కాలం కొద్ది రోజుల కిందటే ముగిసింది. లెక్క అయితే డిప్యూటేషన్ ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీలో రిపోర్ట్ చేయాలి. కానీ అలా చేయలేదు. టీటీడీలోనే కొనసాగుతున్నారు.
నిబంధనల ప్రకారం డిప్యూటేషన్ కు చాన్స్ లేదు. దీంతో ఆయన అక్కడ రాజీనామా చేస్తే రాష్ట్ర సర్వీసులోకి తీసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ప్లాన్ ఏ ప్రకారం.. డిప్యూటేషన్ పొడిగింపు కోసం .. సీఎం స్థాయిలో ప్రయత్నించడం.. ప్లాన్ బీ ప్రకారం.. పదవికి రాజీనామా చేయించి రాష్ట్ర పోస్టు ఇవ్వడం. అయితే అక్కడ రాజీనామా చేస్తే ఇక్కడ పోస్టు ఇవ్వడం కోర్టుల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అందుకే జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి అనుకున్నది సాధించారు.
ఇలాంటి అక్రమ పద్దతుల్లో పదవి పొంది పెత్తనం చేస్తున్న ధర్మారెడ్డి… ఖచ్చితంగా అధర్మారెడ్డే అవుతారు. విశేషం ఏమిటంటే ఈవోగా ఉన్న సమయంలోనే… శేఖర్ రెడ్డి అనే పెద్ద మనిషితో వియ్యం అందుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ శేఖర్ రెడ్డి గురించి సాక్షి మీడియా, వైసీపీ నేతలే గతంలోకథలు కథలుగా చెప్పింది. పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ధర్మారెడ్డి కుమారుడు హఠాత్తుగా చనిపోయాడు.