జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో అన్ని పథకాల పేర్లు మార్చేశారు. చివరికి అబ్దుల్ కలాం పేరుతో చిన్నారులకు ఇస్తున్న పతకాల పేర్లు కూడా తీసేసి వైఎస్ పేరు పెట్టారు. ఈ అంశంపై దుమారం రేగడంతో నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు. అయితే వెనక్కి తీసుకున్నారో లేదో స్పష్టత లేదు. కానీ ఇప్పటి వరకూ అమలు చేయని ఓ పథకానికి జగనన్న పేరు పెట్టి అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రకటించారు. అదే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం. అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న పేరు పెట్టారు.
నిజానికి ఈ పథకానికి డబ్బు ఖర్చు అని పక్కన పెట్టేశారు. తీవ్ర విమర్శలు వస్తూండటంతో అమలు చేస్తామని చెప్పేందుకు ఈ పథకం పేరు పెట్టారు. ప్రపంచంలోని టాప్ 200 యూనివర్శిటీల్లో సీటు వస్తేనే ఆర్థిక సాయం చేస్తారట. అందులోనూ మళ్లీ పేదవాళ్లై ఉండాలి. ఇక ఎవరికైనా సీటు వస్తుందా… వచ్చినా వాళ్లకు క్వాలిటీ చదువు అంది ఉంటుంది.. అంటే ధనవంతులై ఉంటారు. మరి పేదలకు ఎలా న్యాయం జరుగుతుంది. ఎలాంటి సాయం చేసే ఉద్దేశం లేదు కాబట్టే ఇలాంటి పథకం ప్రకటించారు. దానికి కూడా తన పేరు పెట్టేసుకున్నారు జగనన్న.
ఎన్నో పథకాలకు పెట్టుకున్నారు కానీ ఈ పథకానికి పెట్టుకుంటే ఏమవుతుందని అనుకోవచ్చు.. కానీ అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకోవడమే వివాదాస్పదమవుతోది. దళిత వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అసలు అసహనంతో ఉన్న దళితులు మరింత వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏం చేసినా ఓట్లేస్తారనుకునే మైండ్ సెట్ అలాగే ఉంది కాబట్టి మారకపోవచ్చంటున్నారు.