అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో `ఏజెంట్` అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. కొంతమేర షూటింగ్ జరిగింది.కానీ సడన్ గా బ్రేక్ వచ్చింది. `ఏజెంట్` టీమ్ లో సురేందర్ రెడ్డితో పాటు కొంతమందికి కరోనా సోకడంతో… `ఏజెంట్` షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ.. ఈ సినిమాసెట్స్పైకి వెళ్లనుంది. అయితే.. ఈ గ్యాప్ లోనే సినిమా కథకి సంబంధించిన కీలకమైన మార్పులు చేసినట్టు సమాచారం. మరీ ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ ని మార్చి కొత్తగా డిజైన్ చేశార్ట. ఇది వరకటి కంటే, ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ బాగా వచ్చిందని, దాంతో కథ మరింత బలంగా తయారైందని భావిస్తోంది. మార్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం కొత్త సీన్లు పుట్టుకొచ్చాయి. పాత వాటిలో కొన్ని సీన్లు పక్కన పెట్టి వాటి స్థానంలో కొత్త సీన్లు తీయడానికి కూడా రెడీ అయిపోతోంది చిత్రబృందం. ఏజెంట్ అనే కాదు… చాలా కథలు, ఇలా కోవిడ్ సమయంలో కొత్త దారులు వెదుక్కుంటున్నాయి. దర్శకుడికి ఏమాత్రం ఖాళీ దొరికినా.. స్క్రిప్టుని రీరైట్ చేయడానికే చూస్తున్నారు. ఎఫ్ 3, బంగార్రాజు స్క్రిప్టులు కూడా కోవిడ్ – లాక్ డౌన్ సమయంలో భారీ మార్పులూ చేర్పులూ చేసుకున్నాయి. ఇప్పుడు ఏజెంట్ కూడా అంతే.