టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీది మెయిన్ రోల్. వాళ్లలో ఏదో ఓ హీరో… ఏదో ఓ సినిమా చేస్తూనే ఉంటాడు. ఏదో ఓ సినిమా థియేటర్లో ఆడుతూనే ఉంటుంది. 2021లో మాత్రం… మెగా హీరోల సినిమాలన్నీ గుంపు గుంపుగా వచ్చేయబోతున్నాయి. ఆల్మోస్ట్ అందరి హీరోల రిలీజ్ డేట్లూ ఖరారైపోయాయి. మేలో `ఆచార్య` రావడం ఖాయం. రిలీజ్ డేట్ ఖరారు కాకపోయినప్పటికీ…. ఇప్పటికీ.. డేట్ విషయంలో చిత్రబృందం ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు సమాచారం. ఆగస్టు 13న పుష్ఫ విడుదల కాబోతోంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. వరుణ్ తేజ్ సినిమా `గని` జులై 30 న వస్తోంది. పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. `అప్పయ్యనుం కోషియమ్` రీమేక్ కూడా 2021లోనే చూడొచ్చు. అంటే.. పవన్ నంచి ఈ యేడాది రెండు సినిమాలన్నమాట.
అందరికంటే ముందుగా వైష్ణవ్ తేజ్ ముందుకు రాబోతున్నాడు. ఫిబ్రవరి 12న `ఉప్పెన` ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. క్రిష్ – వైష్ణవ్ తేజ్ సినిమా కూడా దాదాపు పూర్తయిపోయింది. ఈ వేసవిలోనే ఈ సినిమాని చూడొచ్చు. రామ్ చరణ్ – ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్ `ఆర్.ఆర్.ఆర్` అక్టోబర్ 13న విడుదల కానుంది. సాయిధరమ్ తేజ్ `రిపబ్లిక్`, కల్యాణ్ దేవ్ `సూపర్ మచ్చీ`లు సెట్స్‌పై ఉన్నాయి. ఇవీ.. ఈ వేసవిలోగా విడుదలైపోతాయి. మొత్తానికి ఈ సీజన్ అంతా మెగా హీరోలదే అనిపిస్తోంది. క్రమం తప్పకుండా ఒకరి తరవాత మరోకరు సినిమాలతో అభిమానుల్ని పలకరించబోతున్నారు. ఇక మెగా అభిమానులకు పండగే.