కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుల విరాళాలతో ప్రారంభమైన 10టీవీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ దిగ్గజాల చేతుల్లోకి వెళ్లింది. అలా ఎలా వెళ్లింది.. అందులో పెట్టుబుడులు పెట్టిన వారికి ఎంతిచ్చారు.. ఎలా తిరిగి ఇచ్చారు అన్నది చాలా కాలంగా చర్చల్లో ఉంది. ఇప్పుడు ఈ అంశంలో సెబీ జోక్యం చేసుకుని విచారణకు ఆదేశిచంచినట్లుగా బయటకు రావడం సంచలనంగా మారింది. మొదట అభ్యుదయ అనే పేరుతో కంపెనీని పెట్టారు. ఆ కంపెనీ పేరుతో కమ్యూనిస్టు సానుభూతిపరుల నుంచి విరాళాలు తీసుకున్నారు. తర్వాత షేర్లను ప్రగతి బ్రాడ్ కాస్టింగ్ పేరుతో మార్చేశారు. ఆ ప్రగతి కంపెనీ ప్రస్తుత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చానల్ అమ్మేసింది. కానీ అభ్యుదయలో షేర్లు కొన్న వారికి ఎలాంటి ప్రతిఫలం అందలేదు.
అయితే ఇవేమీ లిస్టింగ్ కంపెనీలు కావు. సెబీ పరిధిలోకి రావు. కానీ ఆఫర్ ఫర్ సేల్ తరహాలో పబ్లిష్ ఇష్యూ తరహాలో ఈ తతంగం నడిచిందని సెబీకి ఫిర్యాదులు అందాయి ఎవరెవరికి ఎలా షేర్ల బదిలీ జరిగింది.. పెట్టుబడిదారులు ఎవరు … ఎలా అక్రమాలు జరిగాయో వివరిస్తూ.. వివరణ ఇవ్వాల్సిందిగా సెబీ నుంచి ఆదేశాలొచ్చాయి. తతంతం అంతా పబ్లిష్ ఇష్యూ తరహాలోనే జరిగిందని.. కానీ స్టాక్ మార్కెట్ కు సమాచారం లేదని సెబీ అంటోంది. కంపెనీల చట్టాలను పూర్తిగా ఉల్లంఘించారని చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశించింది.
ఈ మొత్తం వ్యవహారంలో చానల్ కొనుగోలు చేసిన పాత్ర చిన్నదే. కానీ.. ఇప్పుడు చానల్ ఉన్న యాజమాన్యానికి చిక్కులు తప్పేట్లుగా లేవు. సరైన యాజమాన్యం లేకుండా వారి వద్ద కొనుగోలు చేశారనే ఆరోపణలు వస్తాయి. ఈ చిక్కులు సెబీ వద్ద నుంచి తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెన్ టీవీలో మైహోం రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి, అల్లు అరవింద్ వాటాదారులుగా ఉన్నట్లుగా చెబుతున్నారు