శుక్రవారం విడుదలైన `గ్యాంగ్ లీడర్`కి నెగిటీవ్ టాక్ వస్తోంది. సెకండాఫ్ ఇంకా బాగుండాల్సిందన్నది విశ్లేషకుల సారాంశం. విక్రమ్ కె.కుమార్ తన తెలివితేటల్ని ట్విస్టుల రూపంలో జోడించడం మర్చిపోయాడు. ఇంకేమైనా కొత్త మలుపులు ఉంటే బాగుండును అనుకునే ప్రేక్షకుడ్ని నిరాశ పరిచాడు. ఇవన్నీ `గ్యాంగ్ లీడర్`లో కనిపించి ఉండుంటే.. ఈ సినిమా మరో రేంజ్లో ఉండేది.
నిజానికి ఈ కథ నాని కంటే ముందు బన్నీ, ఎన్టీఆర్ ల దగ్గరకు చేరింది. బన్నీతో విక్రమ్ కుమార్ కొంతకాలం ట్రావెల్ చేశాడు. ఈ కథతోనే. ఫస్టాఫ్ వరకూ వంక పెట్టని బన్నీ, సెకండాఫ్ విషయంలో భయపడ్డాడు. స్క్రిప్టులో ఇంకొంచెం డెప్త్ కావాలని సూచించాడు. బన్నీ అవసరాలకు తగ్గట్టుగా కథని మలచడానికి విక్రమ్ ఆసక్తి చూపించకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. మైత్రీ కంటే ఈ కథ ముందుగా వైజయంతీ మూవీస్ దగ్గరకు వెళ్లింది. స్వప్నదత్తో కలసి కొన్ని సిట్టింగులు వేశాడు విక్రమ్. అప్పట్లో ఈ కథ ఎన్టీఆర్ కోసం తయారు చేద్దామనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కూడా బన్నీలానే సెకండాఫ్ సరిగా లేదని, స్టార్ హీరోకి సరిపడంత మెటీరియల్ ఈ కథలో లేదని ఎన్టీఆర్ ఈ కథని పక్కన పెట్టినట్టు టాక్. నిజంగానే ఇది స్టార్ హీరో చేయాల్సిన కథ కాదు. నాని, ఎన్టీఆర్ల భయాలే ఇప్పుడు నిజాలయ్యాయి. బన్నీ, ఎన్టీఆర్లలో ఎవరు చేసినా.. ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఓ స్థాయిలో ఉండేవి. కానీ.. నిలబడే ఛాన్సే ఉండేది కాదు. ఆ పరాజయ భారం నుంచి ఈ హీరోలిద్దరూ తప్పించుకున్నారు. నానికి ప్రయోగాలు చేయడం, లైటర్ వేలో ఉండే పాత్రలు పోషించడం ఇష్టం కాబట్టి.. విక్రమ్ కథకు ఓకే చెప్పాడు. తాను కూడా సెకండాఫ్ విషయంలో కాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.