రియల్ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ పడిపోవడం అనేది ఉండదు. అనుకున్నంతగా ఎదకకపోవచ్చు. అందుకే భూమి మీద.. ఇళ్ల మీద పెట్టిన డబ్బులు ఎక్కడికీ పోవని చెట్లకు కాసినట్లుగా డబ్బులు కాస్తాయని పెద్దలు చెబుతూంటారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కాస్త స్లంప్లో ఉంది. దానికి మారుతున్న ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రభుత్వం చేపట్టిన కరెక్షన్స్ కారణంగా ఈ స్లంప్ వచ్చింది. అయితే సెకండ్ హ్యాండ్ ఇళ్ల మార్కెట్ మాత్రం జోరుగా ఉంది.
ఇళ్లు కొనుక్కున్న తర్వాత ఆర్థిక సమస్యలు కావొచ్చు. లాభం వస్తుందన్న కారణంతో కావొచ్చు చాలా మంది ఇళ్లను అమ్మకానికి పెడుతూంటారు. వాటికి మార్కెట్ రేటు లభిస్తుంది. స్థలానికి మార్కెట్ రేటు వస్తుంది కానీ ఇంటి వాల్యూ తక్కవగా ఉంటుంది. అపార్టుమెంట్లు కూడా ఉండే లొకాలిటీని బట్టి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఓ ఏరియాలో ఓపెన్ ప్లేస్ కు ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది వెనుకాడుతున్నారు .కానీ అదే కట్టేసి నాలుగైదేళ్లు అయిన ఇల్లు అయిత ఆలోచించకుండా కొంటున్నారు. ఎందుకంటే.. దానికి అన్ని అనుమతులు ఉన్నాయి. ఎలాంటి సమస్యా లేదని ఎక్కువ మంది నమ్ముతూండటమే.
సహజంగా మధ్యతరగతి ప్రజలు ఈ సెకండ్ హ్యాండ్ ఇళ్లపై ఆసక్తి చూపిస్తూంటారు. రేటు కాస్త తక్కువగా ఉంటుంది. అమ్ముకునేవారు డబ్బులు అవసరం అయి అమ్ముకుంటారు.. అలాంటి వారి దగ్గర కాస్త తక్కువకు కొనుగోలు చేయవచ్చు. అందుకే ఎక్కువ మంది ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఇళ్ల కోసం వాకబు చేస్తున్నారు. ప్రైమ్ ఏరియాల్లో ఆపార్టుమెంట్లు ఇప్పుడు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ లో అమ్ముడుపోతున్నాయి. మణికొండ, కూకట్ పల్లిలో వీటి కోసం బ్రోకర్లను సంప్రదించే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు.