బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డాకు మహారాజ్’. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘ది రేజ్ ఆఫ్ డాకు’ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
ఈ రోజు సెకండ్ సింగిల్ చిన్ని సాంగ్ ని రిలీజ్ చేశారు. ఓ పాపకు బాలయ్య క్యారెక్టర్ మధ్య బాండింగ్ ని ప్రజెంట్ చేసే పాటిది. ‘డాకు మహారాజ్’ జీవితంలో ఎమోషన్ చిన్న. ఆ పాప బాలయ్యకు ఏమౌతుందో రివిల్ చేయలేదు కానీ ఈ కథలో మెయిన్ ఎమోషన్ ఆ పాప నుంచే ఉంటదని అర్ధమౌతోంది.
తమన్ క్యాచి ట్యూన్ ని కంపోజ్ చేశాడు. ”చిన్ని చిన్ని నేనేలే నీకన్ని, నిను మరిపిస్తానే మాఏదో పన్ని.. నా బంగారు కూన.. నా చిన్నారి కూన.. మరి నా కైనా ఎవరే నీ కన్నా.. నీ ప్రాణాలకు ప్రాణమైవున్నా” అంటూ సాగిన అనంత్ శ్రీరామ్ సాహిత్యం ముచ్చటగా గా వుంది. విశాల్ మిశ్రా వాయిస్ ఫ్రెష్ నెస్ ని తీసుకొచ్చింది.
ఈ సాంగ్ లో బాలకృష్ణ, పాప మధ్య బ్యూటీఫుల్ బాండింగ్ కనిపించింది. డాకు మహారాజ్ లోని మరో కోణం ఈ పాటలో వుంది. ఇంత సాఫ్ట్ గా వుండే తను డాకు మహారాజ్ లా ఎలా మారాడనేది ఆసక్తికరం. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.