యూత్ కి నచ్చే కంటెంట్ ని చేస్తున్నాడు శ్రీవిష్ణు. అలా చేసిన తన సినిమాలు మంచి ఫలితాలు చూశాయి. స్వాగ్ లాంటి ప్రయోగం బెడిసికొట్టిన తర్వాత మళ్ళీ యూత్ రూట్ లోకి వచ్చి చేస్తున్న సినిమా సింగిల్. పేరుకి సింగిల్ గానీ ఇందులో ఇద్దరు హీరోయిన్స్. తొలి పాట మంచి రొమాంటిక్ మెలోడీ. ఇప్పుడు రెండో పాట సింగిల్ జీవితం సిర్రాకైయిందని పాడుకునే పాటిది.
జానీ జానీ ఎస్ పప్పా.. జగమంతా జంటలే నేను తప్పా అంటూ మొదలైన పాటలో రామజోగయ్య సాహిత్యం ఆకట్టుకునేలా వుంది. రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ పాటకి మరింత ఎనర్జీ తెచ్చింది. యూత్ కి కనెక్ట్ అయ్యే పాటిది. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణ. మే 9న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.