టాలీవుడ్లో ఆసక్తి కలిగిస్తున్న మరో టైటిల్.. ‘ఎం.ఎల్.ఏ’. కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 23న విడుదల అవుతోంది. ‘ఎంసీఏ’ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అనే ఎబ్రివేషన్ ఉన్నట్టే ‘ఎం.ఎల్.ఏ’ అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి అన్నమాట. ఈ సినిమా కథలో ఎలాంటి రాజకీయ పరమైన అంశాలూ లేవని, జస్ట్ ఫన్ కోసమే ఆ పేరు పెట్టామని చిత్ర దర్శకుడు ఉపేంద్రమాధవ్ చెబుతున్నాడు. ఇది పూర్తి వినోదాత్మక చిత్రమని.. సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుందని అంటున్నారు. అయితే నిజానికి ఈ సినిమాలో కల్యాణ్ రామ్ నిజమైన `ఎం.ఎల్.ఏ`గా కనిపిస్తారని సమాచారం. క్లైమాక్స్‌లో కల్యాణ్‌రామ్‌ని రాజకీయ నేతగా చూడొచ్చని, టైటిల్‌కి జస్టిఫికేషన్ క్లైమాక్స్‌లోనే ఉంటుందని తెలుస్తోంది. మంచి లక్షణాలున్న అబ్బాయి అనిపించుకునే కల్యాణ్‌రామ్… చివర్లో ఎం.ఎల్.ఏ అవ్వడమే.. ఈ సినిమా ఇతివృత్తం. చిత్రబృందం మాత్రం ఆ రహస్యాన్ని కాస్త గోప్యంగా ఉంచాలనుకుంటోంది. ‘పటాస్’తో ఫామ్ లోకి వచ్చినకల్యాణ్ రామ్‌ని ‘షేర్’ మళ్లీ ఫ్లాపుల్లోకి నెట్టింది. మరి ఈ ఎం.ఎల్.ఏ ఏం చేస్తాడో చూడాలి.