ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరుగుతుందన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. రాజధాని గ్రామాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. రాజధానిని విశాఖకు తరలించే విషయంలో…శుక్రవారం జీఎన్ రావు కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేస్తారని జరుగుతున్న ప్రచారంతో..గ్రామాల్లో..పరిస్థితులు కట్టు తప్పేలా కనిపిస్తున్నాయి. ఎంత పోలీసు భద్రత పెట్టినా.. రైతులు ఆగడం లేదు. కేసులు పెడతామని నోటీసులు ఇచ్చినా లెక్క చేయడం లేదు. దీంతో సచివాలయంలో మంత్రివర్గ సమావేశం పెట్టాలనుకున్న ప్రభుత్వం ఇప్పుడు.. ఎక్కడ సమావేశం ఉంటుందనే దానిపై..స్పష్టమైన సూచనలు ఇవ్వడం లేదు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ సమావేశం ఉంటుందని మీడియాకు సమాచారం వచ్చింది.
అది ఎక్కడనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. వెలగపూడి సచివాలయానికి వెళ్లాలంటే.. మందడం గ్రామం మీద నుంచి వెళ్లాల్సి ఉంటుంది. రైతులు ఏదో ఓ సంచలనాత్మక ఆందోళనకు దిగితే.. మొత్తం తేడా కొట్టేస్తుంది. పైగా.. సచివాలయాన్ని ముట్టడించాలని ఇరవై తొమ్మిది వేల మంది రైతులు నిర్ణయించుకుంటే.. ఆపడం పోలీసులకు కూడా కష్టమవుతుంది. అందుకే.. సచివాలయం కన్నా.. ముఖ్యమంత్రి ఇంట్లోనే కేబినెట్ భేటీ నిర్వహిస్తే ఎలా ఉంటుందన్నదానిపై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి ఇల్లు.. తాడేపల్లికి దగ్గరలో ఉంటుంది. పైగా.. పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగలుగుతారు.
సెక్రటేరియట్లో కేబినెట్ భేటీ నిర్వహిస్తే.. ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని.. ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే.. ముఖ్యమంత్రి ఇంట్లోనే ఈ సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడనేదానిపై.. రేపు ఉదయమే… మంత్రులకు కూడా..సమాచారం పంపే అవకాశం కనిపిస్తోంది.