నాగార్జున, కార్తీల మల్టీస్టారర్ చిత్రానికి ఊపిరి అని పేరు పెడితే.. మరీ క్లాసీగా ఉందని ముందు ఫ్యాన్స్ ఫీలయ్యారు. ట్రైలర్ చూశాక.. సినిమాకి సరైన పేరే పెట్టారని ఆనందపడ్డారు. సినిమా వచ్చాక.. ఊపిరికి మించిన టైటిల్ దొరకదని సంబరపడ్డారు. అయితే ఈ టైటిల్ వెనుక ఓ రహస్యం ఉంది. అదేంటంటే.. ఊపిరి టైటిల్ పీవీపీ సంస్థది కాదు. ఆల్రెడీ మరో నిర్మాత ఆ టైటిల్‌ని రిజిస్టర్ చేయించేసుకొన్నాడు. ఆ నిర్మాత ఎవరో కాదు.. నటుడు, కొంతమంది హీరోల పర్సనల్ మేనేజర్.. రాజా రవీంద్ర.
రాజా రవీంద్ర నిర్మాతగా ఓ సినిమా తీయాలని ప్లాన్ చేసుకొన్నాడు. టైటిల్ గా ఊరిపి ఫిక్స్ చేసి.. రిజిస్టర్ చేయించాడు కూడా. అయితే… పీవీపీ సంస్థ అడగడంతో.. కాదనలేక ఇచ్చేశాడు. ప్రతిగా డబ్బులు కూడా అడగలేదట. ‘మీ సినిమాలో మంచి పాత్ర ఇవ్వండి చాలు’ అన్నాడట. దాంతో వంశీపైడిపల్లి రాజా రవీంద్రకు ఓ క్యారెక్టర్ ఇచ్చాడు. ముందు ఐదారు సీన్లు అనుకొన్న ఆ పాత్ర చివరికి మూడు సీన్లకు పరిమితమైంది. ఎడిట్ సూట్‌కి వెళ్లాక. ఒక్క సీన్‌తో సరిపెట్టేశారు. దాంతో రాజా రవీంద్ర అసంతృప్తికి లోనయ్యాడట. ఈ మాత్రం దానికి టైటిల్ అనవసరంగా ఇచ్చేశా.. అని
ఇప్పుడు ఫీలవుతున్నాడట. ఊపిరి టైటిల్ వెనుక ఇంత తతంగం నడిచిందన్నమాట.