కరోనా ధాటికి షూటింగులు బందు చేయాలని తెలుగు చలన చిత్రసీమ పిలుపునిచ్చింది. ఛాంబర్, మా అసోసియేషన్.. అన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈనెల 31 వరకూ ఇదే పరిస్థితి కొనసాగాల్సివుంది. అయితే… ఓ సినిమా మాత్రం గప్ చుప్‌గా మూడ్రోజుల పాటు షూటింగ్ కానిచ్చేసిందని సమాచారం. ఓ యువ హీరోకి సంబంధించిన చిత్రమది. ఓ ఇంట్లో యాక్షన్ పార్ట్ కానిచ్చేశారు. కరోనాని ఖతరు చేయకుండా చిత్రబృందం సాహసోపేతమైన నిర్ణయమే తీసుకొంది. అయితే… చలన చిత్రసీమ ఆదేశాలను బేఖాతరు చేయడమే అసలు సమస్య. ఈ విషయం ఛాంబర్ పెద్దల వరకూ వెళ్లిందని తెలుస్తోంది. `మేం ఆదేశాలను మాత్రమే ఇవ్వగలం. లొకేషన్లకు వెళ్లి బలవంతంగా షూటింగుల్ని ఆపేయలేం కదా` అని ఛాంబర్ పెద్దలు చెబుతున్నార్ట. చిత్రసీమ అంతా ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు మంచో చెడో దాన్ని పాటించాలి. ఎవరిష్టమొచ్చినట్టు వాళ్లు ప్రవర్తిస్తే ఇక ఛాంబర్ లాంటి వ్యవస్థలు ఉండి ఏం లాభం? సదరు నిర్మాత మొండోడు. మహా ఘటికుడు. ఆయనతో పడలేకే… చాంబర్ పెద్దలు మౌనం వహించారని టాక్.