మామూలుగా సిఐడిలు ఎవరిపైనైనా నిఘా వేసి సమాచారం రాబడుతుంటారు. కాని చిత్ర పరిశ్రమలో పేరుకు తగినట్టే చిత్రమైన సిఐడిలు తయారైనారు. వీరంతా మెగా ఫ్యామిలీ కోసం పనిచేస్తుంటారు. మెగా ఫ్యామిలీలో బోలెడు మంది జూనియర్ మెగాలు తయారైనారు కదా.. ఇప్పుడు సూపర్ మెగా కూడా మళ్లీ రంగంలోకి వచ్చారు. మరి ఇంత మందికి కథలు కొత్త ఐడియాలు కావాలంటే మాటలా? ఏదిచేయబోయినా కాస్త డౌటు.. అల్లు అర్జున్ మినహా మిగిలిన వారు ఇప్పటికి పూర్తిగా నిలదొక్కుకున్నది లేదు. కనుకనే పరిశ్రమ కదలికలపై నిరంతరం నిఘా వేసే సిఐడి సైన్యం ఒకటి తయారు చేశారు. ఇటీవల బాగా క్లిక్కవుతున్న యువ దర్శకుల హీరోల చిత్రాలపై వీరు కన్ను వేసి వుంచుతారు. ఏదైనా నిర్మాణంలో వున్నా లేక మొదలైనా సరే కీలకం ఎక్కడుందో పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆ పాయింటును తెచ్చి మెగా హీరోల చిత్రంలో జొప్పించేస్తారు. ఇంకేముంది. ఆ చిత్రం వచ్చేలోగానే ఇది విడుదలైతే క్రెడిట్ వీరికే. ఒక వేళ పండితే పండుగే. చిత్రరంగంలో అవతలివారి గురించి తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతుంటుంది గాని మెగా ఫ్యామిలీ ఆ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి యంత్రాంగాన్నే సృష్టించడం వెరైటీ!