సినిమా సినిమాకీ తీవ్రమైన గ్యాప్ తీసుకొనే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకడు. స్క్రిప్టు పర్ఫెక్ట్ గా సిద్ధం అయ్యేంత వరకూ ఆయన ఏ పనీ మొదలెట్టడు. ‘వ్ స్టోరీ’ తరవాత శేఖర్ కమ్ముల సినిమా ఏదీ మొదలవ్వలేదు. ధనుష్‌తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇంత వరకూ మరో అప్ డేట్ లేదు. ఈ సినిమా తరవాత ఒప్పుకొన్న ‘సర్’ కూడా షూటింగ్ మొదలు పెట్టుకొంది. కానీ శేఖర్ సినిమా ఊసు లేదు.
శేఖర్ కమ్ముల ఇంకా… స్క్రిప్టుని లాక్ చేయలేదని, ఇంకా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడని టాక్. కథపై తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతోందని, ఈ వర్క్ ఓ కొలిక్కి వచ్చాకే… నటీనటులు, మిగిలిన సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది. ధనుష్‌కి కూడా శేఖర్ కేవలం `లైన్` మాత్రమే చెప్పాడని, పూర్తి స్థాయి కథ కాదని తెలుస్తోంది. ‘సర్’ అయ్యాకే.. తన సినిమా మొదలవుతుంది కాబట్టి.. స్క్రిప్టు పూర్తి చేయడానికి శేఖర్‌కి కావల్సినంత టైమ్ ఉంది. 2022లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదని, వచ్చే యేడాదే ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమా కొబ్బరికాయ కొట్టుకుంటుందని తెలుస్తోంది. అంటే.. 2022లో శేఖర్ కమ్ముల సినిమా రాదన్నమాట.