శేఖర్ కమ్ముల సినిమాలది ఓ స్టైల్. పక్కా క్లాస్. ఆయన సినిమాల్లో క్యారెక్టర్లు క్లాస్. మాటలు క్లాస్. పాటల గురించి ఇహ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాటలన్నీ పద్ధతిగా ఉంటాయి. ఏ సంగీత దర్శకుడ్ని ఎంచుకొన్నా, శేఖర్ కమ్ముల స్టైల్‌ని ట్యూన్ అయిపోతారు. తనకు కావల్సిన పాటల్ని రాబట్టుకోవడంలో శేఖర్ దిట్ట.
ఇప్పుడు ఆయన తొలిసారి దేవిశ్రీ ప్రసాద్ తో పని చేయబోతున్నారని టాక్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, ధనుష్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. నాగార్జున కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా రష్మికని ఎంచుకొన్నారు. సంగీత దర్శకత్వ బాధ్యతలు దేవిశ్రీ కి అప్పగించినట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ము, దేవిశ్రీ కాంబో.. నిజంగా కొత్తగా అనిపిస్తోంది. ఎందుకంటే శేఖర్‌కి పూర్తి అపోజిట్ దేవి. ఆయన క్లాస్ ట్యూన్స్ చేశారు కానీ, మాస్ పల్స్ బాగా పసిగట్టిన స్వరకర్త. శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన ప్రతీ ఆల్బమ్ సూపర్ హిట్టే. కొత్త సంగీత దర్శకుల నుంచి ఆయన అద్భుతమైన పాటల్ని తీసుకొన్నారు. మరి దేవిశ్రీతో ఎలాంటి పాటలు కొట్టించుకొంటారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తనదైన కొత్త బాణీ వినిపించడానికి దేవికి కూడా ఇదే సరైన ఛాన్స్.