ఎక్స్ క్లూజీవ్‌: నానితో శేఖ‌ర్ క‌మ్ముల‌

ధ‌నుష్ – నాగార్జున‌ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. అదే ‘కుబేర‌’. ఈ సినిమా శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకొంటోంది. ఆ త‌ర‌వాత శేఖ‌ర్ క‌మ్ముల ఏ హీరోతో సినిమా చేస్తాడు? అనే విష‌యంపై దాదాపు ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఈసారి ఆయ‌న నానితో జ‌ట్టు క‌ట్టే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఈమేర‌కు ఇద్ద‌రి మ‌ధ్యా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఏసియ‌న్ సునీల్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నాని ప్ర‌స్తుతం ‘స‌రిపోదా శ‌నివారం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర‌వాత ‘హిట్ 3’ని ప‌ట్టాలెక్కిస్తాడు. ఈ రెండూ పూర్త‌యిన త‌ర‌వాతే శేఖ‌ర్ క‌మ్ముల సినిమా ఉంటుంది.

శేఖ‌ర్ క‌మ్ముల సినిమా త‌ర‌వాత సినిమా స్పీడుగా తీసే ర‌కం కాదు. రెండు సినిమాల మ‌ధ్య స్క్రిప్టు కోసం గ్యాప్ తీసుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ‘కుబేర‌’ త‌ర‌వాత కూడా అదే జ‌ర‌గ‌బోతోంది. ‘కుబేర‌’ విడుద‌లైన త‌ర‌వాత ఆయ‌న స్క్రిప్టుపై క‌స‌ర‌త్తులు చేయాల్సివుంది. ఆ త‌ర‌వాతే నాని సినిమా మొద‌ల‌వుతుంది. ఈలోగా నాని మ‌రో రెండు సినిమాలు రెడీ చేసినా ఆశ్చ‌ర్యం లేదు. కాక‌పోతే.. నాని – శేఖ‌ర్ క‌మ్ముల కాంబో మాత్రం వెరీ ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌బోతోంది. బాక్సాఫీసుకు కావ‌ల్సినంత కిక్ ఇచ్చే కాంబో ఇది. సో… ఈ కాంబో గురించి ఎంత కాలం వెయిట్ చేసినా త‌ప్పు లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజాభవన్‌లోనే చంద్రబాబు- రేవంత్ భేటీ

చంద్రబాబు ఆహ్వానానికి రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. నేనే వస్తానన్న చంద్రబాబు మాటకు తగ్గట్లుగా ప్రజాభవన్‌లోనే సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాభవన్ అే పేరును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరారు చేశారు....

నెల్లూరు సెంట్రల్ జైలుకు జగన్

వైసీపీ అధినేత జగన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. నాలుగో తేదీన ఆయన తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా నెల్లూరు వెళ్తారు. అక్కడ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

7 మండలాలు కాదు 5 గ్రామాల కోసం రేవంత్

ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే భేటీలో ఏడు మండలాల కోసం పట్టుబట్టాలని .. ముందుగా ఆ అంశం తేల్చిన తర్వాతనే ఇతర అంశాల జోలికి వెళ్లాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్...

అన్నవరం వచ్చేశాడు.. ఇక ఆడబిడ్డలూ వచ్చేస్తారు!

ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కాదు..పదివేలు కాదు..ఏకంగా 30వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని పునరుద్ఘటించారు. ఇంత పెద్ద మొత్తంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close