‘లవ్ స్టోరీ’ తరవాత శేఖర్ కమ్ముల మరోసారి మెగాఫోన్ పట్టాడు. ఆయన దర్శకత్వంలో ధనుష్, నాగార్జునలతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ధారావి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ‘ధారావి’ అనేది ముంబైలోని ప్రధానమైన మురికివాడ. దాని వెనుక ఓ చరిత్రే ఉంది. రజనీకాంత్ `కాలా` సినిమా ఈ ‘ధారావి’ చుట్టూనే తిరుగుతుంది. ఈసారి ధారావితో మాఫియాకు ఉన్న లింకులతో శేఖర్ కమ్ముల ఈ సినిమా తీయబోతున్నాడని టాక్.
శేఖర్ కమ్ములది పూర్తిగా క్లాస్ మేకింగ్. అయితే ఈ సినిమా కోసం తొలిసారి యాక్షన్ బాట పడుతున్నాడు. ముంబై మాఫియాని తనదైన స్టైల్లో చూపించబోతున్నాడు. నాగ్ ఈ సినిమాలో ముంబై డాన్‌గా కనిపించబోతున్నాడని టాక్. రష్మిక కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శేఖర్ కమ్ములతో దేవిశ్రీ ప్రసాద్ పనిచేయడం ఇదే తొలిసారి. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.