టాలీవుడ్ పరిశ్రమలోని పోటీల్లో స్టార్ హీరో కొడుకులైనా సరే సరైన సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే క్రేజ్ లేదంటే పక్కన పడేస్తున్నారు. అందుకే జోరు కొనసాగిస్తున్న యువ హీరోల్లో తాను కూడా ఉంటానని దూసుకెళ్తున్నాడు నాగచైతన్య. ఇప్పటికే సాహంసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కు రెడీ ఉండగా ప్రేమమ్ షూటింగ్ లో బిజీగా ఉన్న చైతన్య ఇప్పుడు మరో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కు సైన్ చేశాడని తెలుస్తుంది.
అందులో ఒకటి సోగ్గాడి డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోది కాగా, మరొకటి తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో అని తెలుస్తుంది. అందిన సమాచారం ప్రకారం సెల్వ రాఘవన్ ఓ యూత్ ఫుల్ స్టోరీతో నాగచైతన్య దగ్గరకు వచ్చాడట. కథ నచ్చడంతో వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట చైతు. అయితే ముందు సెల్వ రాఘవన్ తో తీస్తాడా లేక కళ్యాణ్ కృష్ణతో తీస్తాడా అన్నది త్వరలో తెలియనుంది.
ప్రేమమ్ షూటింగ్ పూర్తి కాగానే తర్వాత సినిమా మొదలుపెట్టే కార్యక్రమంలో ఉన్నాడు చైతన్య. మరి కుర్ర హీరోల జోష్ ముందు నెగ్గుకు రావాలంటే ఈ మాత్రం స్పీడ్ ఉండక తప్పదు. మరి రేసుగుర్రంలా దూసుకెళ్తున్న నాగచైతన్య కెరియర్ లో త్వరలోనే బ్లాక్ బస్టర్ హిట్ పడాలని ఆశిద్దాం.