టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్‌బాబు (71) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని చికిత్స పొందుతూ ఈరోజు (సోమవారం) తుదిశ్వాస విడిచారు.
శరత్ బాబు ది శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస. చదువుతున్న రోజుల్లో ఎన్నో నాటకాలు వేసిన శరత్‌బాబు 1973లో విడుదలైన ‘రామరాజ్యం’తో హీరోగా పరిచయమయారు. తర్వాత సహాయనటుడిగా సుమారు 250కు పైగా చిత్రాల్లో నటించారు. ‘మరో చరిత్ర’, ‘సీతాకోక చిలుక’, ‘సితార’, ‘అన్వేషణ’, ‘స్వాతిముత్యం’, ‘సాగరసంగమం’, ‘సంసారం ఒక చదరంగం’, ‘క్రిమినల్ ఇలా ఎన్నో సినిమాలు ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
శరత్‌బాబు వ్యక్తిగత జీవితంలోకి వస్తే.. నటి రమాప్రభను వివాహమాడారు. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా వివాహమైన కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. శరత్ బాబు చివరిగా నటించిన చిత్రం నరేష్ మళ్ళీ పెళ్లి. ఈ నెల 26న సినిమా విడుదలౌతుంది.
శరత్ బాబు మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. శరత్‌బాబు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.